calender_icon.png 22 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రపంచ ధ్యాన దినోత్సవం

22-12-2025 12:49:00 AM

పాల్గొని ధ్యానం చేసిన అయ్యప్ప మాలధారులు

చిట్యాల, డిసెంబర్ 21(విజయక్రాంతి):  ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో  అయ్యప్ప మాలదారులు ఆదివారం ధ్యాన వేడుకలలో పాల్గొన్నారు.  ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ జీ టీవీ లో ప్రత్యక్ష ప్రసారం లో విక్షిస్తూ ప్రపంచం అంతా ధ్యానం చేస్తుందని తెలిపారు.

మనశ్శాంతి, సుధీర్ఘ విశ్రాంతి, సానుకూల శక్తి  కోసం, వసుదైవ కుటుంబం, శాంతియుత ప్రపంచం కోసం ధ్యానం చేయాలని,  ప్రతినిత్యం పది నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మన కుటుంబం, మన ఊరు, మన ప్రాంతం మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటూ అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి అని  తెలియజేశారు. ఈ మెడిటేషన్ కార్యక్రమంలో ఉరుమడ్ల అయ్యప్ప మాలదారులు  పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.