calender_icon.png 22 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్యాగం చేసిన కుటుంబంపై కుట్రలు

22-12-2025 12:48:39 AM

నాగర్ కర్నూల్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): దేశ స్వాతంత్య్రానికి ముందు ప్రజలను చైతన్యం చేయడానికి స్థాపించిన నేషనల్ హెరాల్ పత్రికను సాకుగా చేసుకుని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమంగా కేసులు నమోదు చేయడం కేంద్ర ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని ఎక్స్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా డిసిసి అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ధర్నాలో ముఖ్యలు పాల్గొని మాట్లాడారు.

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో త్యాగాలు చేశారని, అర్హత కలిగిన విద్యావేత్తకు ప్రధాని పదవి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని వదులుకున్న చరిత్ర ఉందని గుర్తు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేస్తూ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం కొనసాగాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

తప్పుడు కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ కుమార్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.