18-12-2025 12:11:51 AM
నాగారంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ సంతకాల సేకరణ
కీసర, డిసెంబర్ 17(విజయక్రాంతి) : జీహెచ్‌ఏంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియలో భాగంగా నాగారం మున్సిపాలిటీని రెండు డివిజన్లుగా విభజించాలని, రాంపల్లిని కేంద్రంగా ఒక డివిజన్గా ప్రకటించాలని కోరుతూ బుధవారం నాగారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కొండబోయిన నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ..
ప్రజాభిప్రాయ సేకరణ గానీ, అఖిలపక్ష సమావేశం గానీ నిర్వహించకుండా ఏకపక్షంగా వార్డుల పునర్విభజన చేపట్టడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. శివారు మున్సిపాలిటీలలో ఇప్పటికీ గ్రామీణ వాతావరణం ఉందని, వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న అక్కడి ప్రజలను నేరుగా కార్పొరేషన్లో విలీనం చేయడం అన్యాయమన్నారు. ఇలా చేయడం వల్ల రైతులు ’రైతు బంధు’ వంటి ప్రభుత్వ పథకాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా ఉపాధ్యక్షులు గణపురం శ్యామసుందర్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం నాగారం డివిజన్లో 70 వేలకు పైగా ఓటర్లు ఉన్నారని గుర్తుచేశారు. ఇంత భారీ జనాభా ఉన్న ప్రాంతం ఒకే డివిజన్గా ఉంటే ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మధ్య దూరం పెరుగుతుందన్నారు. పాలన సౌలభ్యం కోసం, ప్రజలకు మెరుగైన సేవలందించడం కోసం నాగారంను రెండుగా విభజించి, రాంపల్లిని కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మునిగంటి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దవరం లక్ష్మి, మాజీ సర్పంచ్ మునిగంటి జ్యోతి, మాజీ ఎంపిటీసీ తరిగొప్పుల బలరాం, సీనియర్ నాయకులు రామారం బాలేష్ గౌడ్, నక్క కిషోర్ గౌడ్, జమ్మల్ల శంకర్ గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మంచాల మహేందర్, తాటికొండ రవి, మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు మామిడి జంగారెడ్డి, పోతంశెట్టి వెంకటేశ్వరరావు, ఏనుగు మహేందర్ రెడ్డి,
ఉపాధ్యక్షులు కర్ర వెంకటేశ్వర్, వల్లాల శ్రీనివాస్ గౌడ్, ఎలసాని నాగరాజ్ యాదవ్, రామరం గిరి గౌడ్, కోశాధికారి శైలజ, సోషల్ మీడియా కన్వీనర్ సుంకరి విజయ్, సీనియర్ నాయకులు జూపల్లి నరేష్, మాధవరావు, ముద్రగణం శ్రీనివాస్ యాదవ్, సంతోషి, గవాస్కర్, కపిల్ తివారి, కపర్ది, రమాదేవి, వెంకట్ చారి, కొండేటి రాజశేఖర్ రెడ్డి, ఎలసాని నవీన్ యాదవ్, కర్నె శ్రీనాథ్, మధు గౌడ్, కొండేటి లక్ష్మణ్ రెడ్డి, నెల్లుట్ల బాలరాజ్, శ్రీకాంత్ యాదవ్, శివరాజ్ యాదవ్ లు పాల్గొన్నారు.