calender_icon.png 18 December, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

18-12-2025 12:49:02 AM

మాజీ ఎంపీ వినోద్‌కుమార్

హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ విమర్శించారు. స్వయంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెబుతుంటే, కానీ స్పీకర్ మాత్రం పార్టీ మారలేదు అని చెప్పడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

10వ షెడ్యూల్‌లో రాజ్యాంగ సవరణ చేయాలని, పార్లమెంట్‌లో వెంటనే పార్టీ ఫిరాయింపులపై ప్రత్యేక చట్టం చేయాలని సూచించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పుతో సోనియా గాంధీ భర్త రాజీ వ్ గాంధీ తెచ్చిన చట్టం పనికిమాలిన చట్టంగా తేల్చారని తెలిపారు. పార్టీ ఫిరాయించవచ్చు.. స్పీకర్ దగ్గర పార్టీ ఫిరాయించలేదు అని చెప్తే సరిపోతుందని స్పీకర్ ప్రసాద్ తీర్పు ఇచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నిరుగార్చిందని మండిపడ్డారు.