calender_icon.png 18 December, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టుల అరెస్టును ఖండించండి!

18-12-2025 12:36:27 AM

  1. అరెస్టయిన వారిని కోర్టులో హాజరుపరచాలి
  2. మావోయిస్టు పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి జగన్ 

మంథని, డిసెంబర్ 17 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలం కకర్ బుడ్డీ, బాజ్జీపేట గ్రామాల పరిసరాల్లో నిరాయుధంగా ఉన్న మావోయిస్టుల అరెస్టును ప్రజలు ఖండించాలని మావోయిస్టు రాష్ర్ట  అధికార ప్రతినిధి జగన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాస్వామిక వాతావర ణానికి, ప్రజల అభిష్టానికి ఈ అరెస్టులు ఎదురుదెబ్బ అని అన్నారు. ఫాసిస్టు బీజేపీ రూపొందించిన కగార్ యుద్ధానికి మద్దతునివ్వొదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.

ఇతర ప్రతిపక్ష పార్టీలు, సంఘాలు తెలంగాణలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందు నుండి కొనసాగుతున్న ప్రశాంత వాతావరణాన్ని కొనసాగేందుకు వీలుగా ఆందోళనలు చేపట్టాలని కోరారు. పోలీసులు అరెస్టు చేసిన 16 మందిలో ఇందులో గ్రామస్థులు ఉన్నారని లేఖలో వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించెందుకే ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

అరెస్టు అయిన వారిని వెంటనే కోర్టులో హాజరుపర్చాలని కోరారు. కేంద్రంలోని ఆర్‌ఎస్‌ఎస్, -బీజేపీ ఫాసిస్టు పార్టీ కేవలం కొద్దిమంది కార్పొరేట్ల ప్రయోజనాల కోసం, దేశంలో మనువాది కుల వ్యవస్థతో కూడిన సామాజిక నిర్మించేందుకు ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగిస్తోందని, దానిలో భాగంగానే మావోయిస్టు ముక్తే,  ప్రతిపక్ష ముక్త్ లక్ష్యంతో కగార్ యుద్ధాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు.