18-12-2025 12:38:56 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు విచారణ బుధవారం ఆరో రోజుకు చేరుకుంది. జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయం లో ఉదయం నుంచి సాయ ంత్రం వరకు విచారణ కొనసాగింది. అయితే, గడిచిన ఐదు రోజులుగా మౌనం పాటిస్తున్న ప్రభాకర్ రావు.. ఆరో రోజు కూడా అదే వైఖరిని ప్రదర్శించారు. అధికారులు అడిగే కీలక ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా మాట దాటవేస్తూ దర్యాప్తు బృందాన్ని ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం.
మావోయిస్టుల పేరుతో రాజకీయ నిఘా
ఆరో రోజు విచారణలో సిట్ అధికారులు ప్రధానంగా ప్రొఫైలింగ్ అంశంపై దృష్టి సారించారు. రాజకీయ ప్రముఖులు, వ్యా పారవేత్తల ఫోన్ నంబర్లను మావోయిస్టులు లేదా వారి సానుభూతి పరుల జాబితాలో ఎం దుకు చేర్చారు. రివ్యూ కమిటీని తప్పుదోవ పట్టించి ట్యాపింగ్ అనుమతులు ఎందుకు పొందారు. ఎవ రి ఆదేశాలు ఇలా చేయమని మీకు ఎవరు చెప్పారు. మీరే స్వయంగా నిర్ణయం తీసుకున్నారా లేక గత ప్ర భుత్వ పెద్దల అమాత్యుల ఒత్తిడి ఉందా అని సిట్ గట్టిగా నిలదీసింది. అయితే, ఈ ప్రశ్నలకు ప్రభాకర్ రావు మౌనమే సమాధానంగా నిలిచింది.
ఐ ఫోన్ మిస్టరీ
డిజిటల్ సాక్ష్యాల ధ్వంసంపై అధికారులు కూపీ లాగారు. మీరు వాడుతున్న ఐ-ఫోన్‌ను అమెరికాలో ఎందుకు వదిలేసి వచ్చారు. అక్కడ ఉండే క్లౌడ్ ఖాతాల డేటాను యాక్సెస్ చేశారా? డివైజ్ల నుంచి డేటా ఎందుకు డిలీట్ చేశారు. అని ప్రశ్నించారు. దీనికి ఆయన.. కేవలం తన వ్యక్తిగత సమాచారం మాత్రమే తొలగించానని, ట్యాపింగ్‌తో సంబంధం లేదని పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది.
టెక్నికల్ డేటాతో చెక్
ప్రభాకర్ రావు సహకరించకపోవడంతో సిట్ అధికారులు సాంకేతికతను ఆశ్రయించా రు. ఆయనకు సంబంధించిన 5 ఐ-క్లౌడ్, 5 జీ-మెయిల్ ఖాతాల డేటాను విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఆయన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఆయన డిలీట్ చేసిన డేటాలో ఏముంది? యాపిల్, గూగుల్ సర్వర్లలో సింక్ అయిన సమాచారం ఏంటి.. అనే దానిపై అధికారులు దృష్టి పెట్టారు.
సీసీ కెమెరాల నిఘా..
నిందితుడి ప్రవర్తనను, హావభావాలను గమనించేందుకు సిట్ అధికారులు విచారణ గదిలో ప్రత్యేకంగా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. నేటితో ప్రభాకర్ రావు 7 రోజుల కస్టడీ గడువు ముగియనుంది. ఈలోపు ఆయన నుం చి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.