calender_icon.png 18 July, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జున పరువునష్టం దావా కేసు విచారణ 19కి వాయిదా

13-12-2024 01:28:01 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం కేసు విచారణను నాంపల్లి కోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది. గత విచారణ సందర్భంగా మంత్రి కొండా సురేఖ కోర్టు విచారణకు హాజరుకావాలని ఇటీవల న్యాయస్థానం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో గురువారం జరిగిన విచారణలో కొండా సురే ఖ తరపున హాజరైన న్యాయవాది.. సురేఖ హాజరు కోసం మరో తేదీ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఆయన అభ్యర్థన మేరకు కోర్టు విచారణను ఈనెల 19కి వాయి దా వేసింది. కాగా ఈ కేసులో ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు ముగిసిపోగా, తదుపరి విచారణ కీలకం గా మారింది.

మంత్రి కొండా సురేఖ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో.. నాగచైతన్య, సమంత విడాకులపైన.. నాగార్జున, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై ఇటు నాగార్జున, అ టు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పరువు నష్టం దావా వేశారు. ఈ రెండు కేసుల్లోనూ పిటిషనర్ల వాదనలను కోర్టు రికార్డు చేసింది.