21-11-2024 01:20:39 AM
యూపీలో దారుణం
లక్నో, నవంబర్ 20: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కర్హల్‌లోని కంజారా నది వంతెన సమీపంలో ఉన్న ప్లాస్టిక్ సంచిలో నగ్నంగా ఉన్న దళిత మహిళ మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. ఈ హత్యలో రాజకీయ కోణం ఉందనీ, ప్రశాంత్ యాదవ్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. హత్యకు ముందు మృతురాలిపై లైంగిక దాడి జరిగినట్టు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.
ఉప ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ మద్దతు తెలపకపోడంతో ప్రశాంత్ యాదవ్ పగ పెంచుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ యాదవ్‌తోపాటు మోహన్ కథేరియా అనే మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.