calender_icon.png 27 July, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్గొండకు చెందిన ఆర్మీ జవాన్ అస్సాంలో మృతి

26-07-2024 03:44:20 PM

నల్గొండ: జిల్లాలోని మాదారిగూడెంకు చెందిన భారత ఆర్మీ జవాన్ ఏరాటి మహేశ్ అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు సమాచారం. 24 ఏళ్ల వయసున్న మహేష్ గత ఏడాది కాలంగా అస్సాంలో పనిచేస్తున్నాడు. మహేశ్ మృతి చెందిన సమాచారాన్ని ఇండియన్ ఆర్మీ అధికారులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొంత కాలంగా అస్వస్థతకు గురైన మహేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన భౌతికకాయాన్ని నల్గొండకు తరలించేందుకు అస్సాం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.