calender_icon.png 27 July, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ

26-07-2024 11:20:55 AM

హైదరాబాద్: షిర్డీ నుంచి కాకినాడ వైళ్తున్న రైలులో చోరీ జరిగింది. అర్ధరాత్రి మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. చోరీ జరిగినట్లు మహారాష్ట్ర లాతూరు వద్ద ప్రయాణికులు గుర్తించారు. మూడు బోగీల్లో ఏపీకి చెందిన ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. బంగారు నగలు, డైమండ్ రింగ్స్, ఫోన్లు పోయినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు రూ. 25 లక్షల విలువైన బంగారం, ఫోన్లును దుండుగుల అపహరించారు. చోరీ ఘటనపై తెలగాణ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.