calender_icon.png 5 May, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సేవ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షుడిగా నందిపాట రాజు

10-04-2025 04:37:22 PM

మందమర్రి (విజయక్రాంతి): ప్రజా సేవ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షులుగా పట్టణానికి చెందిన నందిపాట రాజును నియమిస్తూ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీమొద్దీన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం నియామక పత్రాన్ని అందచేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు రాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం పట్ల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీముద్దీన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాద్య తలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సమాజంలోని నిరుపేదలకు సంస్థ తరపున సహాయం అందించేలా తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు సుద్దాల ప్రభుదేవ్, సభ్యులు అబిద్, జావిద్, చరణ్, చింటూ, కవి రాజ్ లు పాల్గొన్నారు.