25-08-2025 11:48:09 PM
బిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి
ఇబ్రహీంపట్నం: రసాయనాలతో తయారుచేసే వాటి వల్ల భవిష్యతలో ముప్పు తప్పదని, రాబోయే వినాయక చవితి వేడుకల్లో మట్టి విగ్రహాలను పూజిద్దాం అని బిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి అన్నారు. సోమవారం బిఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఉచితంగా 1500 మట్టి విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం బిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఏటా గణేష్ ఉత్సవాల్లో ఎక్కడ చూసిన వేలాది కృత్రిమ రసాయనాలతో తయారుచేసిన విగ్రహాలను వాడడం, చూపారులను ఆకర్షించే విధంగా రంగురంగుల విగ్రహాల్లో వాడే రసాయనాలు పూర్తిగా వాతావరణ కాలుష్యం, నీరు భూమి కాలుష్యం అవుతాయని అన్నారు. దీంతో చెట్లకు వాతావరణంలో గాలిలో కాలుష్యం ఏర్పడి భవిష్యత్తులో పెను ప్రమాదాలు జరుగుతాయని, వాటిని నివారించేందుకు తమ ఫౌండేషన్ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. కావున ప్రతి ఒక్కరూ మట్టిని గ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.