calender_icon.png 3 August, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఖేడ్ ఎమ్మెల్యే

24-10-2024 01:28:43 PM

నారాయణఖేడ్, (విజయక్రాంతి): నారాయణఖేడ్ మండల పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో గురువారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఐకెపి కేంద్రాల ద్వారా రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. తమది రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  ఐకెపి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.