calender_icon.png 14 August, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలి

11-08-2025 01:05:25 AM

 కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్, ఆగస్టు 10 :(విజయ క్రాంతి):  జిల్లాలో అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ పథకం కింద రూ.20,000/- ఆర్థిక సహాయం అందజేయబడుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) వర్తిస్తుందని అన్నారు.

ప్రాథమిక జీవనాధార వ్యక్తి మరణించినట్లయితే, అతని వయస్సు 18 ఏళ్లు పైబడి, 60 ఏళ్ల లోపు ఉండాలని సూచించారు. అర్హులైన వారు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకం  ద్వారా ప్రయోజనం పొందేలా విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధితశాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.