19-11-2025 01:02:39 AM
మేడ్చల్ అర్బన్ నవంబర్ 18 (విజయక్రాంతి): గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్‘ కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ 2025 చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకట్ గోపాల్ తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇట్టి ప్రతిజ్ఞ కార్యక్రమం నందు మాదక ద్రవ్యాల కొనుగోలు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్.జూనియర్ అసిస్టెంట్లు.వార్డు అధికారులు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్.ఆర్ పి లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.