calender_icon.png 12 August, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు బీమా కు దరఖాస్తు చేసుకోవాలి..

11-08-2025 10:12:34 PM

ఇచ్చోడ (విజయక్రాంతి): జూన్ 05 వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొంది, ఇప్పటి వరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని వారు మాత్రమే ఆగస్టు 13 లోగా దరఖాస్తులు చేసుకోవాలని వ్యవసాయా విస్తరణ అధికారి క్రిష్ణపాల్(Agricultural Extension Officer Krishnapal) తెలిపారు. సోమవారం రైతు వేదికలో భీమా దరఖాస్తులను స్వీకరించారు. గతంలో బీమా పొందిన రైతులు మార్పులు చేర్పులకు లేదా నామిని చనిపోతే మార్పులకు ఈనెల 12లోగా దరఖాస్తు సమర్పించాలన్నారు. దరఖాస్తుకు రైతు భీమా ఫారమ్ రైతు పట్టాదార్ పాసు పుస్తకం లేదా తహసీల్దారు డిజిటల్ సంతకం అయిన ధ్రువపత్రం, రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలు అవసరమని తెలిపారు. 18 నుండి 59 ఏళ్ల లోపు వారు మాత్రమే బీమాకు అర్హులని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పంద్రం రేణుకా, మారుతి, నారాయణ స్వామి, గంగారాం తదితరులు పాల్గొన్నారు.