calender_icon.png 16 August, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్మాగారాల శాఖ సర్కిల్ కార్యాలయం ఎదుట ఎగురని జాతీయ జెండా

16-08-2025 12:29:41 AM

కనీసం కార్యాలయం తలుపులు కూడా తెరవని అధికారులు

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా కేంద్రంలోని కర్మాగారాల శాఖ సర్కిల్ కార్యాలయం ఎదుట అధికారులు శుక్రవారం జాతీయ జెండాను ఎగరవేయకుండా నిర్లక్ష్యం చూపారు. దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశ నలుమూలల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ఎదుట జాతీయ జెండాను ఎగురవేసి జాతీయతా భావాన్ని ఎలుగెత్తి చాటుతారు. దేశంలోని ఏ కార్యాలయం ఎదుట నైనా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాను ఎగురవేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు.

ఇంతటి పవిత్రమైన రోజైన ఆగస్టు 15న కర్మాగారాల శాఖ సర్కిల్ కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఎగరవేయకుండా కార్యాలయం అధికారులు, సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. మరీ దారుణమేంటంటే శుక్రవారం సెలవు దినంగా పరిగణించారో ఏమో కానీ పరిశ్రమల శాఖ సర్కిల్ కార్యాలయం తలుపులను కూడా తెరవకపోవడం గమనార్హం. జాతీయ పతాకం ఎగరవేయడంలో నిర్లక్ష్యం వహించిన కార్యాలయ సిబ్బందిపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినపడుతోంది.