calender_icon.png 18 November, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ రేసింగ్ విజేత ధృవ్ గోస్వామి

17-11-2025 12:00:00 AM

కోయంబత్తూర్, నవంబర్ 16 : జేకే టైర్ జాతీయ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో ఈ సా రి కొత్త రేసర్లు దుమ్మురేపారు.18 ఏళ్ల యువ సంచలనం ధృవ్ గోస్వామి చాంపియన్‌గా నిలిచాడు. ఎల్జీబీ ఫార్ములా4 విభాగంలో అద్భుత ప్రదర్శనతో విజయం సాధించాడు. 20 ల్యాప్‌లతో కూడిన ఫైనల్ రేసును 7వ ప్లేస్ నుంచి ప్రారంభించినప్పటకీ, మాజీ చాంపియన్ దల్జీత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. అతను ఈ రేసును 19 నిమిషాల 58.57 సెకన్లలో పూర్తి చేశాడు.

ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌లో భాగంగా జరుగుతున్న ఈ పోటీల్లో పలువురు యువ రేసర్లు కొత్త చాంపియన్లుగా అవతరించారు. ఫార్ములా కేటగిరీలో రూకీ టైటిల్‌ను మోనిత్ కుమరన్ శ్రీనివాసన్ కైవసం చేసుకున్నాడు. పాండిచ్ఛేరికి చెందిన బ్రయాన్ నికోలస్ అమెచ్యూర్ కాంటినెంటల్ కప్‌లో విజేతగా నిలిచాడు. జెంటిల్మెన్ రేసులో జై ప్రశాంత్ వెంకట్, రూకీస్‌లో బాలాజీ రాజు, ఫార్ములా ఇండియన్ చాంపియన్‌షిప్‌లో సాచెల్ రోట్జే అగ్రస్థానాల్లో నిలిచారు.