calender_icon.png 18 November, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో వన్డేలోనూ రుతురాజ్ షో

17-11-2025 12:00:00 AM

సౌతాఫ్రికా ఏపై భారత్ ఏ సిరీస్ కైవసం

రాజ్‌కోట్, నవంబర్ 16 :ఒకవైపు సీనియర్ టీమ్ సౌతాఫ్రికా చేతిలో తొలి టెస్ట్ ఓడిపోతే మరోవైపు భారత్ ఏ టీమ్ మాత్రం సఫారీలపై అదరగొడుతోంది. సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగిన మూడు అనధికారిక వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఏ జట్టును భారత్ యువ బౌలర్లు 132 పరుగులకే ఆలౌట్ చేశారు. 

భారత బౌలర్లలో నిశాంత్ సింధు (4/16), హర్షిత్ రాణా (3/21), ప్రసిద్ధ కృష్ణ (2/21) రాణించారు. ఛేజింగ్‌లో మరోసారి రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ మెరుపులు మెరిపిచాడు. అభిషేక్ శర్మ 32(6 ఫోర్లు) ఔటైనా, రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ తిలక్ వర్మ(29 నాటౌట్) జట్టు విజయాన్ని పూర్తి చేశారు. తొలి వన్డేలో సెంచరీ బాదిన రుతురాజ్ రెండో మ్యాచ్‌లో 68(9 ఫోర్లు) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.