calender_icon.png 24 January, 2026 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నంగునూరులో జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీ

24-01-2026 12:56:19 AM

నంగునూరు, జనవరి 23: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నంగునూరు మండల కేంద్రంలో తహసీల్దార్ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేసి,ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ దేశి రెడ్డి,ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మెహబూబ్ అలీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి గౌడ్, ఆర్ ఐ లు లింగం,జయసూర్య, ఉపాధ్యాయులు, రెవెన్యూ,పంచాయతీరాజ్ అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.