08-07-2025 12:41:47 AM
ముషీరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెలో రెండు తెలుగు రాష్ట్రాలల లోని బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ రంగాలకు చెందిన దాదాపు లక్ష మంది ఉద్యోగులు పాల్గొననున్నట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జాయింట్ ఫోరం ఆఫ్ ఫైనాన్సియల్ సెక్టార్ యూనియన్స్ (జె ఎఫ్ ఎఫ్ ఎస్ యు) ప్రకటించింది.
కేంద్రంలో బిజపెపి నేతృత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వం అవలంభిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు ప్రభుత్వరంగ ఆర్ధిక సంస్థలైన బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ రంగాలను కూడా ప్రభావితం చేస్తూ వాటి మనుగడకే ప్రమాదంగా తయారయ్యాయని,
ఈ విధానాలను ప్రతిఘటిస్తామని జెఎఫ్ హెచ్చరించింది. హైదరాబాద్ కోఠిలోని ఎపిటిబిఇఎఫ్ రాష్ర్ట కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ సంస్థల ఉద్యోగులు, అధికారుల యూనియన్లతో కూడిన జేఎఫ్‌ఎఫ్‌ఎస్ యూ నాయకులు బీఎస్ రాంబాబు, సమద్ ఖాన్ (ఎపీటీబీఈఎఫ్‌ఏఐబీఈఏ), ఫణికుమార్ (ఏఐబిఓఏ), టీవీఎన్ ఎస్ రవీంద్ర నాథ్ (ఎస్సీజెడ్‌ఐఈఎఫ్), టీ సతీష్ (ఎన్ జి.తరుపతయ్య (ఎల్‌ఐసీఈయూ),
కె.గంగాధర్ నాయుడు, ఎం హరీశ్ (బీఈఎఫ్‌ఐ), ఎస్.గుణశేఖర్, ఎల్ మద్దిలేటి (ఐసీఈ యూ), యూనియన్ల నాయకులు డి.గిరిధర్, ఆర్.శ్రీనివాస్, మహ్మద్ జావెద్ తదితరులు మాట్లాడారు. ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు మాట్లాడుతూ బ్యాంకింగ్, ఇన్సురెన్స్ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, ఇప్పటికైనా ఈ విధానాలను విధానాలను విరమించుకోనట్లయితే పార్లమెంట్ బిల్లు పెట్టిన రోజే దేశవ్యాప్తంగా బ్యాంకింగ్, ఇన్సురెన్స్ సంస్థలలో నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ప్రధాన కార్యదర్శి టివిఎన్ రవీంద్రనాథ్, ఎఐబిఓఎ అధ్యక్షులు ఫణికుమార్, ఎన్. అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ టి. సతీష్ లు ప్రసంగించారు.