calender_icon.png 12 August, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిమవాసులే అందరికీ ఆదర్శం

10-08-2025 12:00:00 AM

- భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రరావు 

- ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

భద్రాచలం, ఆగస్టు 9 (విజయక్రాంతి): కొండ కోనల్లో నివసించే ఆదివాసి గిరిజనులు సంస్కృతి, సంప్రదాయాలను పాటిం చడంలో ప్రపంచ స్థాయిలో ప్రత్యేక స్థానం ఉన్నదని, అటువంటి ఆదిమవాసుల గిరిజనులను ఆదర్శంగా తీసుకుంటే దేశ సంస్కృతి, ఆదివాసి తెగ అంతరించిపోకుండా కాపాడుకున్నవారం అమవుతామని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు.

శనివారం భద్రాచలంలోని ఆదివాసి గిరిజన భవనంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసి దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల సంక్షేమానికి ఐటీడీఏ ఎంతో కృషి చేస్తుందని, విద్య, వైద్యం వ్యవసాయం మౌలిక వసతుల కల్పన, గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల  రాష్ట్ర ప్రభుత్వం 40శాతం డైట్ చార్జీలు, వందల శాతం కాస్మోటిక్స్ కొత్త మెనూ ప్రవేశపెట్టి పిల్లలకు పౌష్టికరమైన ఆహారం అందిస్తుందని చెప్పారు.

అంతకు ముందు ఐటిడిఎ ప్రాజె క్టు అధికారి బి రాహుల్, సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, వివిధ ఆదివాసి సంఘాల నాయకులతో కలిసి స్థానిక అంబేద్కర్ కూడలి దగ్గర ఉన్న ఆదివాసి తెగల గిరిజనుల కోసం పోరాడిన అమరవీరుల స్థూపాలకు పూలమాలవేసి ఆదివాసి జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, సబ్ కలెక్టర్ మృనల్  శ్రేష్ట ప్రసంగించారు.

ఆదివాసుల హక్కులను పరిరక్షించాలి 

హనుమకొండ(విజయక్రాంతి): ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులను కాపాడాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వీరన్న కోరారు. హనుమకొండ గిరిజన భవన్‌లో జరిగిన ఆదివాసి దినోత్సవంలో వీరన్న మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో విద్య వైద్యం అందించాలని, అక్షరాస్యత శాతం పెంచాలని, సంక్షేమ పథకాల అందించాలని, గిరిజన విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్యను అందించాలని కోరారు.

కాగా ఈ నెల 12న జరిగే ఆదివాసీ గిరిజన సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని వీర న్న, గిరిజన విద్యార్థులు ఆవిష్కరించారు. గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, హెచ్‌ఆర్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు బి రాజు నాయక్, కొమరం స్వాతి, మంకిడి సురేందర్ పాల్గొన్నారు.