calender_icon.png 22 September, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గాభవానీ ఆలయంలో నేటి నుంచి నవరాత్రోత్సవాలు

22-09-2025 12:00:00 AM

కరీంనగర్ క్రైం, సెప్టెంబర్21(విజయక్రాంతి):త్రిమూర్తులకు శక్తి ప్రదాత. త్రిలోకే శ్వరి సకలాభీష్ట ప్రదాయిని శ్రీదుర్గాభవానీ శరన్నవరాత్రోత్సవాలు కరీంనగర్ నగునూర్లోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో సోమవా రం నుండి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఫౌండర్ చైర్మెన్ వంగల ల క్ష్మన్ తెలిపారు.

ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకారుల సమావే శంలో ఆయన మాట్లాడుతూ దక్షిణామ్నా య శృంగేరీ శారదా పీఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్న పరివార సమేత  దుర్గాభవానీ ఆలయంలో నిర్వహిస్తున్న నవరాత్రులలో భాగంగా 22 సోమవారం ఉదయం గురు వందనం, గోపూజ, పుణ్యాహవాచనం, గ్ర హారాధన, కలశస్థాపన, చండీపారాయణ చ తుష్టష్యుపచారపూజ, చండీహోమం, మంగళహారతి, కన్యాసువాసినీ పూజలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఆమ్మవారు బ్రహ్మీ అలంకరణలో హంస వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని ఆయన వివరించారు.

సా యంత్రం బతుకమ్మ, పల్లకీ సేవ, కోలాటం, రాజోపచార పూజలు జరుగుతాయని ఆయ న తెలిపారు. ఈ ఉత్సావాలలో భాగంగా ప్ర తి రోజు ఉదయం సాయంత్రం గంగా హా రతి ఉంటుందన్నారు. 23న మహేశ్వరీ అలంకరణలో నంది వాహనంతో, 24న కౌ మరీ అలంకరణలో నెమిలి వాహనంతో, 25న వైష్టనీ అలంకరణలో గరుడ వాహనంతో, 26న లలిత త్రిపుర సుందరిగా హం స వాహనంతో, 27న ఇంద్రాణి అలంకరణలో గజ వాహనంతో, 28న రాజరాజేశ్వరి అలంకరణలో,

29న సరస్వతీ అలంకరణలో హంస వాహనంతో, 30న దుర్గా అలంకరణలో సింహావాహనంతో, 1న అన్నపూర్ణ అలంకరణలో, 2న గురువారం విజయలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారనిఆయన పెర్కోన్నారు, చండీహో మం మహాపూర్ణాహుతి , సాయంత్రం దస రా వేడుకలు, జమ్మిపూజ, రాంలీల కార్యక్రమాలు జరుగుతాయని. 3వ తేదీ శుక్రవారం అర్ధనారీశ్వర అలంకరణలో నంది,

సింహ వాహనలతో అమ్మవారు దర్శనమిస్తారని, ఉదయం 11 గంటలకు దుర్గాభవానీ సందరేశ్వరుల పట్టాభిషేకం, రథోత్సవం జరుగు తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ కమిటి బాధ్యులు వేములవా డ ద్రోణాచారి, నీరుమల్ల తిరుపతి, రాచమల్ల ప్రసాద్, పల్లెర్ల శ్రీనివాస్, తొడుపునూరి వేణుగోపాల్,తదితరులుపాల్గోన్నారు.