calender_icon.png 19 November, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాణిగా నయనతార

19-11-2025 12:29:32 AM

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ‘ఎన్‌బీకే111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. ఇందులో ఆమె నటిస్తున్న మహారాణి పాత్ర ఈ కథనానికి కీలకం కానుంది.

సింహ, జైసింహా, శ్రీరామరాజ్యం తర్వాత బాలకృష్ణ, నయనతార కలిసి నటిస్తున్న నాలుగో చిత్రమిది. మంగళవారం నయనతార పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ ప్రాజెక్టులో భాగమైన విషయాన్ని టీమ్ అధికారికంగా వెల్లడించింది. మేజెస్టిక్ అనౌన్స్‌మెంట్ వీడియోతో సినిమా అంబిషస్ స్కేలు, విజువల్ స్పెక్టకిల్ అన్నీ అద్భుతంగా చూపించారు. నయనతారను గుర్రంపై పరిచయం చేసిన విధానం ద్వారా ఈ ప్రాజెక్ట్ ఎంత భారీ స్థాయిలో రూపొందుతుందో స్పష్టమవుతోంది.

గోపిచంద్ మలినేని తొలిసారిగా హిస్టారికల్ డ్రామాలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఇప్పట్నుంచే ఆసక్తి నెలకొంది. కమర్షియల్ చిత్రాల్లోని తనదైన మాస్ టచ్‌ను ఒక భారీ చారిత్రక కథలో మిళితం చేస్తూ, బాలకృష్ణను ఇప్పటివరకు చూడని ఓ కొత్త అవతార్ చూపించబోతున్నారు డైరెక్టర్ గోపిచంద్. ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.