19-11-2025 12:28:18 AM
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న ఈ చిత్రాన్ని డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్ల ద్వారా థియేటర్లలో నవంబర్ 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నాయకానాయికలు అఖిల్‌రాజ్, తేజస్విని విలేకరులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా హీరో అఖిల్ రాజ్ మాట్లాడుతూ.. “తెలంగాణ యాస నాకు తెలిసినా, ప్రాంతాన్ని బట్టి పదాలు పలికే తీరు మారుతుంది కాబట్టి కథ జరిగిన ఊరిలో ఎలా మాట్లాడతారో డైరెక్టర్ ద్వారా తెలుసుకున్నా. రెండు నెలలు డప్పు కొట్టడం నేర్చుకున్నా. నేను చేసిన రాజు పాత్ర ప్రతి అబ్బాయికి కనెక్ట్ అవుతుంది. ప్రతి ప్రేమలో బాధ, కోపం, సంతోషం ఉంటాయి. ప్రేమకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో ధైర్యంగా నిలబడతాడు రాజు. నిజమైన ప్రేమలో ఉన్న ప్రేమికులు ఒకరి కోసం మరొకరు ఎంత బలంగా నిలబడతారనేదే ఈ సినిమా కథ.
ఇది చాలా బలమైన ప్రేమకథ. ఈ స్క్రిప్ట్ చదివేప్పుడు క్లుమైక్స్‌లో ఊపిరాగినట్టనిపించింది. క్లుమైక్స్ చదివిన బాధలోనే ఉండిపోయా. నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం విషాదకరం. ఆ ప్రేమికులు ఈ ఘటనను ఎలా డీల్ చేశారో కదా అని బాధగా అనిపించింది. పదేళ్లుగా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్నా. ఆ కష్టానికి ఫలితం ఈ సినిమా తీసుకొస్తుందని నమ్ముతున్నా.
ఇటీవల వేరే కొన్ని ఆఫర్స్ వచ్చినా ఈ చిత్రాన్నే ప్రమోట్ చేసుకుంటున్నా. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి నా జీవితం మారిపోతుందని నమ్ముతున్నా. నా తర్వాతి సినిమా ‘స్మాల్ టౌన్ బాయ్స్’ సురేశ్ ప్రొడక్షన్ ద్వారా విడుదల కానుంది. అనుపమ, తరుణ్ భాస్కర్ నటిస్తున్న ఓ చిత్రంలోనూ ఉన్నా. ఏ పాత్రయినా హానెస్ట్‌గా కనిపించాలనుకుంటా” అన్నారు.
ఎమోషన్స్ పండాలని వర్క్‌షాప్స్ చేశాం
హీరోయిన్ తేజస్వినీ మాట్లాడుతూ.. “నేను తెలంగాణ యాసలో మాట్లాడేందుకు డైరెక్టర్ సాయిలు సపోర్ట్ చేశారు. ప్రతి పదం ఎలా పలకాలో నేర్పించారు. రాంబాయి పాత్రలో అనేక లేయర్స్ ఉన్నాయి. తను ప్రేమికుడు రాజు దగ్గర క్యూట్‌గా హ్యాపీగా ఉంటుం ది. కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడుతుంది. తన ప్రేమను తండ్రి అంగీకరించాలని తపనపడుతుంది. హీరోయిన్లకు ఇలాంటి క్యారెక్టర్స్ దొరకడం అరుదు.
మన తెలుగు సినిమాలో అందంగా రాసిన పాత్ర అనే ప్రశంసలు రాంబాయి క్యారెక్టర్‌కు దక్కుతాయి. ఈ సినిమా క్ల్లుమాక్స్ పార్ట్ షూట్ చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా చాలా భావోద్వేగానికి గురయ్యాను. సినిమా చివరి 30 నిమిషాలు మనసులను మెలిపెట్టేలా ఉంటుంది. నటించిన తర్వాత ఆ సన్నివేశం నుంచి బయటకు రావడం కష్టంగా ఉండేది. అంతగా ఉద్వేగానికి గురయ్యాం.
క్లుమైక్స్‌లోని ఎమోషన్ ప్రేక్షకుల గుండెలను హత్తుకునేలా ఉండా లని వర్క్‌షాప్స్ చేసి నటించాం. ఈ సినిమాను ‘7జీ బృందావన్ కాలనీ’, ‘ప్రేమిస్తే’, ‘బేబి’, ‘సైరత్’ లతో పోల్చుకోవచ్చు. ఆ చిత్రాల్లాగే కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంటుంది. నేను ప్రస్తుతం తమిళంలో ప్రభు సోలొమన్‌తో ఓ సినిమా చేస్తు న్నా. తెలుగులో ఇంకా ఏ సినిమా సైన్ చేయలేదు. కథలు వింటున్నా. నా వచ్చే స్క్రిప్ట్స్‌ను ఒక ప్రేక్షకురాలిగానే వింటా. స్క్రిప్ట్ ఆకట్టుకునేలా ఉంటే నటిస్తాను” అన్నారు.