calender_icon.png 3 August, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీ గురుకులంలో వసూళ్ళ దందాకు పాల్పడిన సిబ్బంది తొలగింపు..!

02-08-2025 10:59:34 PM

విజయక్రాంతి కథనానికి స్పందించిన అధికారులు

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో అడ్మిషన్ ల పేరుతో వసూళ్ల దందాకు పాల్పడిన ఇద్దరు సిబ్బందిని విధుల్లో నుండి శాశ్వతంగా తొలగించినట్లు శనివారం ఉన్నతాధికారులు తెలిపారు. ఆఫ్లైన్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కంప్యూటర్ ఆపరేటర్  ముస్తాక్, వార్డెన్ దర్వేష్ లు తరచూ వసూళ్లకు పాల్పడుతున్న విషయం బహిర్గతమైంది. అదే పాఠశాలలో పనిచేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగి వద్ద తన ఇద్దరు పిల్లలను అదే పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించినందుకు కానుకగా వార్డెన్ ధర్వేశ్ కంప్యూటర్ ఆపరేటర్ ఇరువురూ ఫోన్ ద్వారా పది వేలు ఇవ్వాలని డబ్బులు డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై విజయక్రాంతి శనివారం ' మైనారిటీ గురుకులంలో వసూళ్ల దందా" అనే శీర్షిక వార్తా కథనాన్ని ప్రచురించడంతో ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ గోపాల్ నాయక్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఇరువురినీ విధుల్లో నుంచి తొలగించినట్లు తెలిపారు. ప్రిన్సిపల్ సుంకన్న పై కూడా తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అతనిపై యాక్షన్ తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. గురుకుల పాఠశాలలో వర్గాలుగా ఏర్పడి వసూళ్లకు పాల్పడుతున్నట్లు విచారణలో తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.