calender_icon.png 26 July, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది రోజుల్లో ఆదుకోవాలి.. లేదంటే ఆందోళన తప్పదు

21-06-2025 12:07:05 AM

ఇండ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించిన 

మాజీ ఎమ్మెల్యేలు గువ్వల, జైపాల్ యాదవ్

చారకొండ, జూన్ 20: చారకొండ మండలంలోని శిరసునగండ్ల వద్ద ఆలయ భూముల్లో జరిగిన ఇండ్ల కూల్చివేతతో పలువురు పేద కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. ఎన్నో ఏళ్లుగా అక్కడే పని చేసుకుంటూ ఇల్లు నిర్మించుకుంటే కక్షపూరితంగా ఆ ఇండ్లను కూల్చారని భావిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్లు బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం 10 రోజుల్లో స్పందించకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగతామని హెచ్చరించారు. తక్షణ నిత్యవసరాల కోసం రూ.2 లక్షల సాయం అందించడంతో పాటు, ప్రతి కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం ప్రకటించారు.బాధితులకు పునరావాస భూములు, ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షతో ఇండ్లను కూల్చేశారంటూ బాధితులు ఆవేదనవ్యక్తంచేశారు.