23-10-2025 12:02:36 AM
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్తాపనలు, ప్రారంభోత్సవాలు
టేకులపల్లి, అక్టోబర్ 22,(విజయక్రాంతి): టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య బుధవారం విస్తృతంగా పర్యటించారు. మండలంలోని మద్రాస్ తండా, బిల్లుడు తండా, పానుగోతు తండా, కొప్పురాయి పంచాయతీలోని కొత్తూరు - దారపాడు సీసీ రోడ్డు, మొక్కంపాడు అంగన్ వాడీ కేంద్రం భవనం ప్రారంభోత్సవం చేశారు. సీసీ రోడ్డు శంకుస్థాపన, నూతన అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేశారు. ఎమ్మెల్యేకి గ్రామాల్లో హరతులతో ఆడపడుచులు ఘన స్వాగతం పలికారు.
శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా రూ.13,53,000 /- వ్యయం గల సిఎంఆర్ ఎఫ్ చెక్కులను, రూ. 6,06,000/- వ్యయం గల కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. సులానగర్ గ్రామంలో పూర్తి అయిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. సొంతింటి కల నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే తన పర్యటనలో భాగంగా గ్రామాల్లోని ఇందిరమ్మ ఇండ్లను, ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు, లబ్దిదారులకు బిల్లుల చెల్లింపులుపై ఆరా తీశారు.
సాంకేతిక సమస్యలు వెంటనే పరీష్కరించె విధంగా అధికారులు చురుకుగా పనిచేయాలంటూ అదేశించారు. నిర్లక్ష్యం వహిస్తె కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ ఎంపీడీఓ మల్లీశ్వరి, తహసీల్దార్ వీరభద్రం, సిఐ బత్తుల సత్యనారాయణ, ఎస్త్స్ర శ్రీనివాస్ రెడ్డి, పీఆర్ ఏఈ నవీన్, హౌసింగ్ ఏఈ గణేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూక్యా దేవా నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, తాజా, మాజీ ప్రజా ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.