07-08-2025 12:56:29 AM
క్యాంప్ ఆఫీసు ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి) : బోథ్ నియోజకవర్గ ప్రజలకు మరింత అం దుబాటులో ఉండేందుకే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని బుధవా రం మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
అనంతరం క్యాంపు కార్యాల యంలో పూజాలు నిర్వహించారు. ఈ మేర కు ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గంలోని తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాలు బోథ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు రావడం ఇబ్బందిగా ఉన్నంద న్నారు.
దింతో ప్రజల సౌకర్యార్థం ఆదిలాబాద్ లోని డీఆర్డీఏ గెస్ట్ హౌస్ ను క్యాంప్ కార్యాలయంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండటానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.