24-01-2026 12:41:02 AM
గజ్వేల్ జనవరి 23: తల సేమియా రోగులకు అండగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆపన్న హస్త మిత్ర బృందం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా తలసేమియా వ్యాధి తో బాధపడుతున్న వారి కోసం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ హైదరాబాద్ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఆపన్న హస్త మిత్ర బృందం సభ్యులతో వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకొని వారు, దూర ప్రాంతాల నుండి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 277 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్సీ శ్రీ వంటేరు యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, ఏఎంసి చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ లు రాజ మౌళి, గాడిపల్లి భాస్కర్, ,స్థానిక సిఐ రవికుమార్ గారు , ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లబండి పద్మజ్యోతి, వైద్యులు నరేషబాబు, పెంటచారి, లింగం, స్థానిక గజ్వేల్ పట్టణ ప్రముఖులు, ఆపన్న హస్త మిత్ర బృందం అధ్యక్షులు పాశికకంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరి శ్యామ్ ప్రసాద్, ఉపాధ్యక్షులు, మంగలి సాయి, కొలిచెలిమి స్వామి, రాజు, శ్రీకాంత్ సభ్యులతో పాటు రెడ్ క్రాస్ సిబ్బంది శ్రీకాంత్, డాక్టర్ రామ సుబ్బా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.