14-11-2025 12:50:36 AM
ప్రారంభించిన ఎస్‌ఎంబీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ అరుణ్‌బాబు
ఖైరతాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి) : కాళోజి నారాయణ యూనివర్సిటీ కి అనుబంధగా ఉన్న ఎస్‌ఎంబీ కాలేజీ ఆఫ్ ఫిజియోథెరపి లో నూతన ఫిజియోథెరపి కోర్సు ప్రారంభం అవుతున్నట్లు కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ అరుణ్ బాబు, డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్ లు తెలిపారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరుణ్ బాబు మాట్లా డుతూ ఇంటర్ మీడియట్‌లో బైపీసీ, ఒకేషనల్ విద్య ను అభ్యసిస్తున్న వారికోసం నాలుగున్నర సంవత్సరాల ఫిజియోథెరపి కోర్సును ఎస్ ఎం బి లో నూతనంగా ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.సీట్ల కోసం హైదరాబాద్ లోని తమ ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
ఒక బ్యాచ్‌లో మొత్తం 50 మంది విద్యార్థులు ఉంటారని అందులో ముప్పు మంది కౌన్సిలింగ్ నుండి మిగతా ఇరవై మంది మేనేజ్ మెంట్ కోటాలో సీట్లు భర్తీ చేస్తారని ఆయన పేర్కొన్నారు.ఫిజియోథెరపికి మన దేశంలో, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.