14-11-2025 12:51:19 AM
సింగరేణి ఏరియా జీఎం రాధాకృష్ణ
మందమర్రి, నవంబర్ 13: ప్రస్తుత పోటీ ప్రపంచంలో సింగరే ణి సంస్థలు నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ఉద్యోగులు, అధికారులు కృషి చేయాలని సింగరేణి ఏరి యా జిఎం ఎన్ రాధాకృష్ణ కోరారు. జిఎం కార్యాలయంలో ఈ నెల19 వరకు నిర్వహించనున్న బొగ్గు నాణ్యత వారోత్సవాలను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. బొగ్గు నాణ్యత వారోత్సవాలను పురస్కరించుకొని నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధనకు మన వంతుగా కృషి చేయాలన్నా రు.
నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి ప్రతి సింగరేణియుడు తనవంతుగా కృషి చేయాలని, అంతే కాకుండా నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడంలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, సీఎంఓఏఐ జాయిం ట్ సెక్రటరీ రవి, ఇన్చార్జి పర్సనల్ మేనేజర్ ఆసిఫ్, క్వాలిటీ మేనేజర్ ప్రదీప్, సీనియర్ పిఓ శంకర్, జిఎం కార్యాలయం ఉన్నత అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.