02-07-2025 11:35:10 PM
ఇండియా vs ఇంగ్లాండ్: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్(Edgbaston)లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఆటలో భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్(Shubman Gill) మరోసారి అద్భుతమైన శతకాన్ని సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి రోజు ఆటలో 85 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది, కెప్టెన్ గిల్ సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు. వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) కూడా హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. కెప్టెన్‌గా మొదటి రెండు టెస్ట్‌లలో సెంచరీలు చేసిన నాల్గవ భారత టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ నిలిచాడు. దీంతో విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ సరసన జాబితాలో చేరాడు. యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) కూడా తన అద్భుతమైన ఇన్నింగ్స్(87)ని ప్రారంభించి, సెంచరీని తృటిలో కోల్పోయాడు.