calender_icon.png 2 January, 2026 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

02-01-2026 01:24:18 AM

మఠంపల్లి, జనవరి 1: మండలంలోని కొత్త దొనబండ తండా, కాల్వపల్లి తండా చర్చిలో నూతన సంవత్సరం వేడుకలు పాస్టర్ నతానీయేల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కొత్త దొనబండ తండా గ్రామ సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు నాయక్, కాల్వపల్లి తండా సర్పంచ్ మాలోతు సక్రు నాయక్ హాజరయ్యారు.ఈ సందర్భంగా చర్చి పాస్టర్ పూష్ప గుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు.

సర్పంచ్లు కెక్ కట్ చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా సోదరి సోదరీమణులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపారు.  ప్రజలందరూ సుఖ సంతోషాలతో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి లక్ష్మి భరత్ నాయక్, రాజేష్ నాయక్, రమేష్, కోట నాయక్, రాజ నాయక్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.