23-12-2025 12:08:38 AM
భీమదేవరపల్లి ,డిసెంబర్ 22 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిమండలంలోని ముల్కనూరులో గల ఆదర్శ పాఠశాలలో డిసెంబర్ 22 శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఆదర్శ పాఠశాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలో నూతనంగా ఏర్పాటుచేసిన గణిత ప్రయోగశాలను మండల విద్యాధికారి సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా గణిత ప్రయోగశాలలో గణితానికి సంబంధించిన వివిధ రకాలైన ఎగ్జిబిట్స్ మరియు పజిల్స్ విద్యార్థులు ప్రదర్శించారు.
ఇందులో భాగంగా విద్యార్థులు ట్రెజర్ హంట్, గణిత గుర్తుల తో తయారు చేసిన రంగోలి ఆకట్టుకొన్నాయి. అలాగే రామానుజన్ సంఖ్య 1729 ను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ రెహమాన్ గారు మాట్లాడుతూ నిజజీవితంలో గణిత ప్రాముఖ్యతను వివరించారు. ఈ సమావేశంలో గణిత ఉపాధ్యాయులు ఆచరిత, రవీందర్ రెడ్డి, వెంకట్, ఇతర ఉపాధ్యాయులు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పాల్గొన్నారు.