23-12-2025 12:10:15 AM
మంచిర్యాల, డిసెంబర్ 22 (విజయక్రాంతి): కోట్ల రూపాయలు లాభాలు గడిం చిన సింగరేణి సంస్థ నేడు ఆవిర్భావ వేడుకలకు వెనుకంజ వేస్తుంది. సింగరేణి డే అం టేనే కార్మికులకు, వారి కుటుంబ సభ్యలకు పెద్ద పండుగ లాంటిది. అలాంటి పండుగను జరిపేందుకు సింగరేణి సంస్థ ఆవిర్భావ వేడుకలకు సింగరేణి మొండి చెయ్యి చూపనుందా.. అంటే అవుననే సమాధానమే వ స్తుంది. సింగరేణి ఆవిర్భవించి 136 ఏళ్లయింది. ఏటా నిర్ణయించే ఆవిర్భావ వేడు కలకు ఈసారి యాజమాన్యం మంగళం పాడింది.
నిధుల కొరత పేరుతో సింగరేణి 136 ఏళ్ల చారిత్రక ఉత్సవాలకి ఎగనామం పెట్టినట్లేనని చెప్పవచ్చు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కార్మిక లోకానికి ఉత్సవాలకు కొర్రి పెడుతూ, తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. సింగరేణి ఉత్సవాల కంటే మిస్సీ ఆటనే కంపెనీకి ముఖ్యమైందా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణి యాజ మాన్యం తిరోగమన ధోరణి మరెన్ని కోతలకు, వాతలకు దారితీస్తోందనే ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతుంది.
సింగరేణి మనుగడపై ప్రమాద పొంచివుందని పరిశీలకులు భావిస్తున్నారు. సింగరేణి వేడుకలు జరుపుకోవడమంటే మన శ్రామిక చరిత్రను ప్ర పంచానికి చెప్పడమే అని ఆధ్యంతం సంబరపడిపోయారు. అలాంటిది సంబరాలను ఒక్కసారిగా నిలిపివేయడం సమంజసం కాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు గత ఏడాది (2024-25) రూ.47 లక్షలు కేటాయించిన యాజమాన్యం కేవలం రూ.8 లక్షలు మాత్రమే కేటాయించింది.
ఏరియాకు రూ.60 వేలు
ఏటా డిసెంబర్ 23న సింగరేణి వ్యా ప్తంగా 11 ఏరియాలలో అబ్బురపరిచే రీతి లో సింగరేణి వేడుకలు కన్నుల పండువగా జరుపుతారు. పది రోజుల క్రితమే ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సి ఆట కోసం రూ.10 కోట్లు కేటాయించిన సింగరేణికి సింగరేణి వేడుకలకు నిధుల కొరత సాకుతో వేడుకలకు నిధులు లేవనడాన్ని కార్మిక సంఘాలు, కార్మికులు తప్పు పడుతున్నారు. గతంలో సింగరేణి ఆవిర్భావ ఉత్సవాలకు ప్రతి ఏరియాకు రూ.మూడు నుంచి మూడున్నర లక్షలు, కార్పొరేట్‌లో రూ.10 లక్షల వరకు బడ్జెట్‌ను కేటాయించి అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేది.
ఈసారి ఆ బడ్జెట్‌ను సుమారు 70 శాతం తగ్గించింది. ప్రతి ఏరియాకు రూ.60 వేలు మాత్రమే కేటాయిం చింది. అది కూడా జీఎం ఆఫీస్ కేంద్రంలో పతాకావిష్కరణ కోసమే ఈ నిధులను కేటాయించింది. సింగరేణి వేడుకల నిర్వహణ విషయంలో సింగరేణి యాజమాన్యం అ నూహ్యమైన మార్పు కార్మిక లోకాన్ని ఒక్క సారిగా షాక్‌కు గురి చేసింది. మొక్కుబడిగా వేడుకలకు పరిమితం కావడం పట్ల సింగరేణిలో నిప్పులు చెరుగుతున్నారు. కేవలం జెం డా ఆవిష్కరణలతోనే వేడుకలు సరిపెట్టుకు నే మొక్కుబడిగా తంతుగా కార్యక్రమం ము గించడం పట్ల విమర్శలు పెల్లుబికుతున్నాయి.
కేటాయించిన నిధులు
కోల్ బెల్ట్ ప్రభావిత ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేటాయించా ల్సిన సీఎస్సార్, డీఎంఎఫ్టీ నిధులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న యాజమాన్యం పం డుగల జరుపాల్సిన వేడుకలను ఘనంగా నిర్వహించకపోవడం ఏంటని పలువురు కార్మికులు ప్రశ్నిస్తున్నారు. శ్రీరాంపూర్ ఏరియాకు రూ. 60 లక్షలు, మందమర్రికి రూ. 60 లక్షలు, బెల్లంపల్లికి రూ. 55 లక్షలు కేటాయించారు.
అలాగే కార్పొరేట్ కు లక్ష, కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి, ఆర్జీ 1, ఆర్జీ 2 గనులకు రూ. 60 లక్షలు, ఆర్జీ 3, ఇల్లందుకు రూ. 55 లక్షలు, సత్తుపల్లికి రూ. 50 లక్షలు, నైనీకి రూ. 35 లక్షలు, ఎస్టీపీపీకి 25 లక్షలు, హైదరాబాద్ కార్యాలయానికి 20 లక్షలు కేటాయించారు. ఇంత తక్కువ నిధులు ఎప్పుడు కేటాయించలేదని రిటైర్డ్ కార్మికులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కార్మిక సంఘాల స్పందన కరువు
సింగరేణి కార్మికులకు పండుగ లాంటి సింగరేణి వేడుకలను కంపెనీ నిలిపివేయడంపై కార్మిక సంఘాల రావాల్సిన స్పందన లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదో మొక్కుబడిగా మాట్లాడుతున్నారు. కంపెనీ తీరును సూటిగా వ్యతిరేకించడం లేదు. ప్రధాన సంఘాల నేతల్లో కొందరు వేడుకల వల్ల దుబారా ఖర్చులాగా మాట్లాడుతూ పరోక్షంగా కంపెనీ నిర్ణయాన్ని సపోర్టు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వేడుకలపై కంపెనీ నిర్ణయాన్ని ఖర్చులతో ముడిపెట్టి చూడకూడదని, దాని వెనుక కంపెనీ కుట్రను ఖండించాలని, మిస్సి ఆట కోసం రూ. 10 కోట్లు కేటాయిస్తే ఏ కార్మిక సంఘం నాయకుడు ఖండించలేదని, అది దుబారా అని ఎవరూ అనలేదని, కార్మిక సంఘాల్లో సమర్ధవంతమైన పనితీరు లో పం ఇలాంటి పరిస్థితులకి ప్రధాన కారణంగా పలువురు భావిస్తున్నారు.