23-12-2025 12:11:08 AM
సినీ నటుడు పృద్విరాజ్ చేతుల మీదుగా ధనుర్ముఖి అవార్డు
మిర్యాలగూడ,(విజయక్రాంతి): బిర్లా సైన్స్ అకాడమి భాస్కర ఆడిటోరియంలో ఆదివారం జరిగిన ధనుర్మాస సంగీత నృత్య మహోత్సవంలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన భూక్య నీతు నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. విజయ మాధవి సేవా సాంస్కృతిక అకాడమి తరఫున ఉత్తమ నాట్య ప్రదర్శన చేసిన నీతు విలక్షణ సినీ నటుడు డాక్టర్ బాలిరెడ్డి పృద్విరాజ్ చేతుల మీదుగా ధనుర్ముఖి అవార్డుతో పాటు మేమెంటోను అందుకున్నట్లు భరతనాట్య శిక్షకులు కూరెళ్ల వేణుగోపాల శర్మ సోమవారం తెలిపారు. నీతు చేసిన ఉత్తమ నాట్యప్రదర్శన కి అవార్డు దక్కడం పట్ల అకాడమీ వ్యవస్థాపకులు విజయ మాధవిలతో పాటు తల్లిదండ్రులు భూక్య రాంబాబు, అరుణలు హర్షం వ్యక్తం చేశారు.