calender_icon.png 20 November, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్లో నిఖత్ జరీన్

20-11-2025 12:18:51 AM

గ్రేటర్ నోయిడా, నవంబర్ 19:ప్రపంచ బాక్సింగ్‌లో భారత హవా మరో స్థాయికి చేరింది. గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్‌లో ఏకంగా 15 మంది భారత బాక్సర్లు ఫైనల్స్‌కు చేరుకున్నారు. వివిధ విభాగాల్లో 8 మంది మహి ళలు, ఏడుగురు పురుషుల ఫైనల్లో అడుగుపెట్టారు. తెలంగాణ బాక్సర్ , రెండుసార్లు వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది.

సెమీస్‌లో నిఖత్ 5 స్కోర్‌తో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ గుల్సెవర్‌పై విజడయం సాధించిం ది. అన్ని రౌండ్లలోనూ పూర్తిగా ఆధిపత్యం కనబరుస్తూ నిఖత్ పంచ్‌ల వర్షం కురిపించింది. ప్రీతి పవార్, అరుంధతి , మీనాక్షి, నుపుర్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్నారు.

16 దేశాల నుంచి 130 మంది ఎలైట్ బాక్సర్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ పూర్తి ఆధిపత్యం కనబరుస్తోంది. దాదాపు అన్ని విభాగాల్లోనూ మన బాక్సర్లు అదరగొట్టారు. ఒలింపిక్ మెడలిస్టులు, వరల్డ్ చాంపియన్లకు సైతం షాకిచ్చి ఫైనల్స్‌కు దూసుకొచ్చారు.