calender_icon.png 20 November, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోనెక్స్ సన్‌రైజ్ నేషనల్స్ విజేతగా తెలంగాణ

20-11-2025 12:17:44 AM

అదరగొట్టిన అండర్ బాలికల జట్టు

హైదరాబాద్, నవంబర్ 19: బ్యాడ్మింటన్‌లో చాంపియన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారి న తెలంగాణ మరోసారి జాతీయ స్థాయిలో మెరిసింది. అరుణాచల్‌ప్రదేశ్ ఇటానగర్ వే దికగా జరిగిన యోనెక్స్ సన్‌రైజ్ 48వ ఇం టర్ స్టేట్, ఇంటర్ జోనల్, జూనియర్ నేషనల్స్ బ్యాడ్మింటన్ టోర్నీ అండర్ బాలి కల విభాగంలో తెలంగాణ చాంపియన్‌గా నిలిచింది. ఈ పోటీల ఆరంభం నుంచీ అద్భుత ప్రదర్శనకో ఆకట్టుకున్న తెలంగాణ బాలికల జట్టు ఫైనల్స్‌లో ఢిల్లీపై విజయం సాధించింది.

బాలుర విభాగంలో తెలంగాణ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా తెలంగాణ జట్లను జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభినందించారు. క్రమశిక్షణ, పట్టుదల,అంకితభావంతో సా ధించిన ఈ విజయాలు జాతీయ స్థాయిలో తెలంగాణ బ్యాడ్మింటన్‌కు మరింత గౌరవం తీసుకొచ్చాయని ప్రశంసించారు. బ్యాడ్మింటన్‌లో తెలంగాణ నుంచి రానున్న రోజుల్లో మరింత మంది చాంపియన్లు వెలుగులోకి వస్తారని ఆకాంక్షించారు.