calender_icon.png 7 September, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాంసాగర్ ప్రాజెక్టు పరిశీలన

02-09-2025 12:00:00 AM

నిజాంసాగర్ సెప్టెంబర్ 01(వికాయక్రాంతి): నిజాంసాగర్ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు లు సోమవారం నాడు నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు వచ్చిన నేపథ్యంలో ప్రాజెక్టు ఇంజనీర్లతో ప్రాజెక్టు సంబంధించిన రక్షణ చర్యలను అడిగి తెలుసుకున్నారు, ప్రాజెక్టు పటిష్టంగా ఉందని ఎటువంటి ఇబ్బంది లేదని ఇంజనీర్లు తెలిపారు,దానితో పోచారం  సంతృప్తి వ్యక్తం చేశారు

దేవుడు దయ వలన ఈ సంవత్సరం  నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి లో నిండినది, వానాకాలం, యసంగి పంటలకు ఇబ్బంది లేకుండా సాగు నీరు అందించవచ్చన్నారు. రైతులు సాగునీటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టుఅని భారీ వర్షాలు, వరదలు వచ్చిన ప్రాజెక్టు పటిష్టంగా, సురక్షితంగా ఉందని తెలిపారు.

రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మంజీరా నది లోకి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేసే క్రమంలో మంజీరా నది పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వారి వెంట బాన్సువాడ మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,నాయకులు రవీందర్, ఏజాస్ తదితరులు ఉన్నారు.