calender_icon.png 26 September, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దు

26-09-2025 12:00:00 AM

స్మితా సబర్వాల్‌కు హైకోర్టులో ఊరట

హైదరాబాద్, సెప్టెంబర్ 25: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు హైకోర్టు ఊరటనిచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం విదితమే. ఈ నివేదికలో ఐఏఎస్ స్మితా సబర్వాల్ పేరును కూడా కమిషన్ పేర్కొంది.

దీనిపై స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి దీనిని విచారిస్తామని పేర్కొంది.