calender_icon.png 25 July, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భట్టి నుంచి సమాధానం రాలేదు

24-07-2025 01:00:04 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ నెల 15న ఇచ్చిన లీగల్ నోటీసులకు ఇంకా సమాధానం రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచ ందర్‌రావు తెలిపారు. నోటీసులు అందిన 3 రోజుల్లోగా తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన నోటీసుల్లో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

లేదంటే తన పరువుకు భం గం కలిగించినందుకు రూ.25 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని, క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోక తప్పద ని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే గడువు ముగిసి పోయిన నేపథ్యంలో.. కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామని రాంచందర్‌రావు విజయక్రాంతికి తెలిపారు.