05-11-2025 12:00:00 AM
-ఆస్ట్రేలియాతో నాలుగో టీ20
-తుది జట్టులో మార్పులు లేనట్టే
-ఫినిషర్ రోల్‌లో జితేష్ శర్మ
గోల్డ్ కోస్ట్, నవంబర్ 4 : ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకున్న భారత్ ఇప్పుడు మరో పోరుకు రెడీ అయింది. గురువారం గోల్డ్‌కోస్ట్ వేదికగా నాలుగో టీ ట్వంటీలో తలపడబో తోంది. తొలి మ్యాచ్ వర్షంతో రద్దవడం.. రెండో మ్యాచ్‌లో ఆసీస్ గెలవగా..మూడో టీ ట్వంటీలో భారత్ పుంజుకుని సిరీస్ సమం చేసింది. గత మ్యాచ్‌లో భారత తుది జట్టు కాంబినేషన్‌లో మార్పులు చేయడం కలిసొచ్చింది.
అవకాశాలు దక్కించుకున్న ముగ్గు రూ సత్తా చాటడంతో భారత్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా అర్షదీప్‌సింగ్ తాను ఎంత కీలక బౌలరో నిరూపించుకున్నాడు. హర్షిత్ రాణా ప్లేస్‌లో జట్టులోకి వచ్చిన అర్షదీప్ 3 కీలక వికెట్లతో ఆసీస్‌ను దెబ్బకొట్టాడు. అలాగే కుల్దీప్ ప్లేస్‌లో వచ్చిన వాషింగ్టన్ సుందర్ బ్యాట్‌తో రెచ్చిపోయా డు. అటు సంజూ శాంసన్ ప్లేస్‌లో అవకాశం దక్కించుకున్న జితేష్ శర్మ ఫినిషర్ రోల్‌లో అదరగొట్టాడు. ఫలితంగా హోబార్ట్‌లో తొలిసారి ఆసీస్‌కు పరాజయాన్ని రుచి చూపించిన భారత్ సిరీస్ ఆశలను నిలుపుకుంది.
ఇప్పుడు నాలుగో టీ ట్వంటీలో భారత తుది జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విన్నింగ్ కాంబినేషన్‌ను మా ర్చే అవకాశాలు కనిపించడం లేదు. మూడో టీ20లో గెలిచిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇదే విషయాన్ని పరోక్షంగా చెప్పాడు. కాంబినేషన్ బాగా సెట్ అయిందంటూ వ్యాఖ్యానించాడు. దీంతో తుది జట్టులో మార్పులు జరిగే లేనట్టే. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.
అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతున్న సంజూ ను తప్పించి గత మ్యాచ్‌లో జితేష్ శర్మను తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో జితేష్ శర్మ చివర్లో మెరుపులు మెరిపించాడు. 13 బంతుల్లోనే 22 పరుగులు చేసి ఫినిషర్ రోల్‌కు న్యాయం చేశాడు. ఫలితంగా ఇప్పుడు సంజూకు చోటు దక్కని పరిస్థితి. అయితే సంజూ 21 సార్లు డకౌటైనా అవకాశాలిస్తానంటూ గతంలో గంభీర్ చెప్పిన మాటపై ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే కుల్దీప్ యాదవ్‌ను సౌతాఫ్రికాతో సిరీస్‌కు సన్న ద్ధం చేసే క్రమంలో స్కాడ్ నుంచి రిలీజ్ చేశారు. కుల్దీప్ భారత్ ఏ జట్టు తరపున సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగే అనధికార మ్యా చ్‌లో ఆడతాడు. దీంతో కుల్దీ ప్ ప్లేస్‌లో వచ్చిన వాషింగ్టన్ సుందర్ ప్లేస్‌కు ఢోకా లేదు. సుందర్ బౌలింగ్ చేయకున్నా బ్యాట్‌తో 49 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక హర్షిత్ రాణా స్థానంలో చోటు దక్కిన అర్షదీప్ కూడా గత మ్యాచ్‌లో అదరగొట్టాడు. పవర్ ప్లేలోనే 2 కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. ఓవరాల్‌గా 4 ఓవర్ల స్పెల్‌లో 35 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసిన అర్షదీప్‌ను తప్పించే పరిస్థితి లేదు. దీంతో హర్షిత్ రాణా బెంచ్‌పైనే ఉండనున్నాడు. ఇప్పటికే హర్షిత్ కోసం చాలాసార్లు అర్షదీప్‌ను పక్కన పెట్టడంపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఫామ్‌లో ఉన్న అర్షదీప్‌ను తప్పిస్తే గంభీర్‌కు ట్రోలింగ్ తప్పదు. ఇక బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎటువంటి మార్పు లు జరిగే అవకాశాలు లేవు.
భారత తుది జట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ, శివమ్ దూబే,అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా