29-04-2025 12:49:34 AM
మీ బడ్జెట్ కంటే మా ఆర్మీ బడ్జెట్ పెద్దది
* భారతదేశం కంటే పాకిస్థాన్ అరగంట కాదు.. అర్ధ శతాబ్దం వెనకబడి ఉంది. మీ దేశ బడ్జెట్ కంటే మా ఆర్మీ బడ్జెటే పెద్దది. అమాయక ప్రజలను చంపితే.. ఏ దేశం కూడా మౌనంగా ఊరుకోదు. ఉగ్రవాదులు పహల్గాం పర్యాటకులను చంపే ముందు వారి మతాన్ని అడిగారు. ఈ నీఛ సంస్కృతి మా మతంలో లేదు. మీరు ఖవారీజ్ కంటే దారుణం.
ముంబై, ఏప్రిల్ 28: భారత్‌పై అణుయుద్ధం చేస్తామంటూ పాకిస్థాన్ రాజకీయ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. పాకిస్థాన్ బడ్జెట్ కంటే మా ఆర్మీ బడ్జెట్ పెద్దదని ఆయన ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు అణుయుద్ధం చేస్తామని పాక్ నాయకులు భారత్‌ను బెదిరించకూడదని హితవు పలికారు.
భారత్‌పై అణుబాంబులతో దాడి చేస్తామంటూ పాక్ మంత్రి హనిఫ్ అబ్బాసి చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలోని ప్రభానిలో జరిగిన బహిరంగ సభ లో ఒవైసీ ప్రసంగించారు. ‘భారతదేశం కం టే పాకిస్థాన్ అరగంట కాదు అర్ధ శతాబ్దం వెనకబడి ఉంది.
మీ దేశ బడ్జెట్ కంటే కూడా మా ఆర్మీ బడ్జెట్ పెద్దది. అణుయుద్ధం చేస్తామని పాకిస్థాన్ నాయకులు భారతదేశాన్ని బెదిరించకూడదు. వేరే దేశంలో అమాయక ప్రజలను చంపితే.. ఏ దేశం కూడా మౌనం గా ఊరుకోదని వాళ్లు గుర్తుంచుకోవాలి. ఉగ్రవాదులు పహల్గాం పర్యాటకులను చంపే ముందు వారి మతాన్ని అడిగారు.
మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నా రు? మతాన్ని అడిగిమరీ ప్రజలను చంపే నీచ సంస్కృతి మా మతంలో లేదు. మీరు ఖవారీజ్ కంటే దారుణం. ఈ చర్య మీరు ఐఎస్‌ఐఎస్ వారసులని చెబుతోంది’ అని విమర్శించారు.
అలాగే, భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ గత కొన్నేళ్లుగా ఉగ్రవా దులకు శిక్షణ ఇస్తోందని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్‌ను చుట్టుముట్టడానికి, నైతిక హ్యాకర్లను ఉపయోగించి వాళ్ల ఇంటర్నెట్‌ను హ్యాక్ చేయడానికి భారత్‌కు అంతర్జాతీయ చట్టాలు అనుమతిస్తాయి’ అని ఒవైసీ అన్నారు.
కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం
కొన్ని టీవీ ఛానళ్లు కశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయని అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదులతో పోరాడుతూ తన ప్రాణాలు అర్పించిన వ్యక్తి ఓ కశ్మీరీ. గాయపడిన ఓ పిల్లవాడిని తన వీపుపై మోసుకెళ్లి రక్షించిన వ్యక్తి కశ్మీరీ’ అని ఒవైసీ పేర్కొన్నారు. కశ్మీరీలను భారత్‌లో అంతర్భాగంగా గుర్తించాల ని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీకి సూచించారు. పాకిస్థాన్‌ను ఆర్థికంగా బలహీనపర్చడానికి ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని ప్రధానిని ఒవైసీ డిమాండ్ చేశారు.
మీ తల్లిని చంపిందెవరు?
చిన్న పిల్లాడిలా మాట్లాడకు బిలావల్!
‘సింధూ నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుంది’ అంటూ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ నిప్పులు చెరిగారు. చిన్న పిల్లాడిలా మాట్లాడకు.. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అసలు నీకు తెలుస్తుం దా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆయన తాత భుట్టో, తల్లి బేనజీర్ భుట్టో విషయంలో ఏం జరిగిందో ఆయనకు బొత్తిగా తెలియదు.
పాకిస్థాన్‌లో పెరిగిన ఉగ్రవాదులే ఆయన తల్లి, తాతను చంపారు. అందువల్ల అతడు ఇలా మాట్లాడి ఉండకూడ దు. తన తల్లి ఎలా చనిపోయిందో అ తడు ఆలోచించాలి. మీ తల్లిని కాల్చి చంపితే అది ఉగ్రవాదం అవుతుంది. అదే మా తల్లుల్ని, ఆడకూతుళ్లను చం పితే ఉగ్రవాదం కాదా? అసలు అత డు ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం అవుతుందా?’ అని ఒవైసీ మండిపడ్డారు.