26-08-2025 02:50:03 AM
అధికారులకు జీహెఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశం
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 25 (విజయక్రాంతి): ప్రజావాణికి అందిన వినతుల పై తక్షణమే స్పందించి, వాటిని సత్వర మే పరిష్కరించాలని జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
సోమవారం జీహెఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జీహెఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు ఆరు జోన్ల పరిధిలో కలిపి మొత్తం 194 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ.. “ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలను మన దృష్టికి తీసుకొస్తున్నారు.
వారి నమ్మకాన్ని వమ్ము చేయవద్దు. ఒకసారి అర్జీ ఇచ్చిన వారు, అదే సమస్యపై మళ్లీ మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత విభాగాధిపతులపై హెఓడీ ఉంది” అని స్పష్టం చేశారు.