07-07-2025 12:00:00 AM
చాలా రోజుల తర్వత రేమేష్ బయటికి వచ్చాడు. అతడు ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఆఫీసుకి వెళ్లి పని చేసినా, ఇంటి నుంచి పని చేసినా, కంప్యూటర్ సిస్టంతోనే అతని జీవితం. పని బోర్ కొడితే ఆన్‌లైన్ ఆటలు, లేకుంటే ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్ రీల్స్ గంటల కొద్దిగా చూడటం. సురేష్‌కి సృజనతో పెళ్లయింది, కాని ఎన్ని సంవత్సరాల క్రితం అయిందో అతనికి ఇప్పుడు గుర్తులేదు.
బహుశా అతడికి పెళ్లయి ౧౫ సంవత్సరాలై ఉంటుంది. సృజ న కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీరే. ఆమెకు కుడా ఒక ల్యాప్టాప్ ఉండటంతో, ఎవరి సిస్టమ్స్‌లో వాళ్లు తలకు పెటట్టి ఉంటా రు. కొంచెం సమయం దొరికితే చరవాణి కాలక్షేపం అనివా ర్యం వ్యసనమై కూర్చుంది.
సిస్టమే లేని కంప్యూటర్ సిస్టం జీవితంలో “ఈ క్షణం” ఎలా పుట్టిందో వాళ్లకి తెలియదు. కాని ఇప్పుడు ఈక్షణానికి పదేళ్లు ఉంటాయి. కూతురి చేతిలో టీవీ రిమోట్, స్మార్ట్ ఫోన్ పెట్టడంతో, తల్లిదండ్రులకు ఆమె గురించి ఆలోచించాల్సిన అవసరం అంత పెద్దగా కలగలేదు. ముగ్గురు ఇంట్లోనే ఉంటారు కాని, ఒకరితో మరొకరు మాట్లాడుకునే తీరిక ఉండదు. ఇక బయట వారితో మాట్లాడే ఓపిక, అవసరం కూడా పెద్దగా ఉండదు.
ఈ యాంత్రిక జీవితం నుంచి చాలా నెలల తర్వాత బయటకు వచ్చిన సురేష్, రంగు రంగుల వెలుగుల భవనాలను చూస్తూ దుర్గం చెరువు వంతెన మీదికి కారు నడిపించాడు. చల్లని వాతావరణం హాయిగా అనిపించింది. కారు పక్కకి ఆపి బయటకు చూస్తూ తన్వయత్వం పొందుతూ యథాలాపంగా కారు స్లుడ్ మిర్రర్లో తనను తాను చూసుకుని చూసి ఉలిక్కిపడ్డాడు. మళ్లీ మళ్లీ అలా చూసుకున్నాడు.
జాగ్రత్తగా చూసుకున్నాడు, షర్ట్ కాలర్‌పై భాగాన ఖాళీగా ఉంది. అతని తల అతనికి కనబడటం లేదు. అతనికి తల లేకున్నా తాను అన్ని చూడగలుగుతున్నాడు. దబ్బున కారులోంచి దిగి మనుషులను తేరిపారా చూశాడు. అతనికే కాదు, అక్కడ చాలా మందికి తలలు లేవు, మగవారికి. ఆడవారికి కూడా. కొంతమంది పిల్లలకు తలలున్నాయి, కొంతమంది పిల్లలకు తలలు లేవు. కాని వాళ్లంతా మామూలుగానే మాట్లాడుతున్నారు.
సురేష్‌కు ఏమీ అర్థం కావటం లేదు. తన తలకేమైయ్యింది ? మిగతావాళ్ళ తలలకి ఏమయింది ? తన తల ఎప్పటికీ తనకు రాదా ? ఈ తలలు లేకుండా ఉండే మనుషుల గురిం చి గూగుల్ ఏమి చెబుతుంది? ఆ ఆలోచన రాగానే తన స్మార్ట్ ఫోన్ తీసి సెర్చ్ చేశాడు. పెద్దగా వివరాలు ఏమి లభించలేదు. గూగుల్ కి తెలియని విషయాలు కూడా ఉంటాయా? అని ఆశ్చర్యపోయాడు. పదే పదే సెర్చ్ చేయడంతో ‘మీరు వైద్యుడి ని సంప్రదించండి’ అని గూగుల్ సలహా ఇచ్చింది.
అప్పుడు కాని అతని తలలేని బుర్రకి హాస్పిటల్ ఉంటుందన్న విషయం వెలగలేదు. వెంటనే అతడు కారులో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. తనకు తల లేకపోయినా, కారు డ్రైవ్ చేయగలుగుతున్నాడు. దగ్గరలో ఉన్న పెద్ద ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్లాడు. అనేక మంది జనాలు, కొందరు రోగులు, కొందరు వాళ్లతో వచ్చి నవాళ్లు, చాలా మందికి తలలు లేవు. తలలేని శరీరాలు ముభావంగా కూర్చునట్లు న్నాయి.
కొన్ని తలలున్న శరీరాల వాళ్లు ఉన్నారు, వాళ్లంతా నవ్వుతూ కనిపించారు. ఏ డాక్టర్‌ని కలవాలి ? దాదపు వంద మంది డాక్టర్ల పేర్లు రాసి ఉన్న బోర్డుని చూశాడు. ఇంత మంది స్పెషలిస్టులు ఉన్నారంటే ఎన్ని రకాల రోగాలున్నా యో ? కానీ తన రోగం ఏమిటో తనకు తెలియడం లేదు. విశాలమైన టేబుల్ వేనుక కూర్చు ని నవ్వుతున్న అమ్మాయి కనిపించింది. ఆమె నవ్వుతుంది. ఆమె శరీరానికి తల కూడా ఉంది. ఆమె నవ్వుకి, అందమైన ముఖానికే ఉదోగ్యం ఇచ్చినట్లున్నారు.
“నా తల నాకు కనపడటం లేదు. ఏ డాక్టర్ దగ్గరకెళ్లాలి” అని ఆత్రంగా అడిగాడు సురేష్. అందంగా నవ్వింది ఆడ తల. “మీకు దృష్టి లోపం కావొచ్చు, కళ్ల డాక్టర్ దగ్గరకెళ్లండి” అంటూ ఫీజు వివరాలు చెప్పి వసూలు చేసింది. కంటి డాక్ట ర్ గదిలోకి వెళ్లాడు సురేష్. అక్కడ తెల్లని కోటు వేసుకున్నా తలలేని శరీరం.. మెడ ఉండాల్సిన చోట స్టెతస్కోపు వేలా డుతోంది. “డాక్టర్ గారు ! నాకు మీ తల కనపడటం లేదు.
అద్దంలో చూసుకున్నా, నా తల నాకు కనపడటం లేదు అని భయంగా అడిగాడు సురేష్, డాక్టర్ కోటు దగ్గరగా వచ్చి టార్చ్ లైట్ వేసి సురేష్ కళ్లని పరిశీలించాడు.“నా తలే నాకు కనపడకపోతుంటే, నా కళ్లు మీకు ఎలా కనిపిస్తున్నాయ్ ?” అని అడిగాడు సురేష్,
“నాకు మీ తలలో కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. నాకు మీ కళ్ళతో మాత్రమే పని. మీ కళ్లలో ఏ దోషం లేదు” అని చెప్పాడు డాక్టర్.
“మీకు తల లేకుండా మీరు ఎలా మాట్లాడుతున్నారు ? నా మాటలు ఎలా వినగలగుతున్నారు” అని ఆశ్చర్యంగా అడిగాడు సురేష్.
“నాకు తల లేకపోవటం ఏమిటి ? నా తలలోని తెలివి తేటలు చూసి ఈ హాస్పిటల్ లో నాకు ఉద్యోగమిచ్చారు. నువ్వు నిజంగానే తల లేనివాడిలానే మాట్లాడుతున్నావ్. నువ్వు మెంటల్ హాస్పిటల్‌కి వెళ్లు. నా దగ్గర నీకు వైద్యం లేదు” అని విసుగ్గా సమాధానం చెప్పాడు కంటి డాక్టర్.
“ఇదేంటి నాకు పిచ్చి అంటాడు. తల లేని వాడికి పిచ్చి ఎలా ఉంటుంది. ఈ డాక్టరుకే పిచ్చి, వాడికి తల లేకపోయి న పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు” అనుకుంటూ హాస్పి టల్ నుండి బయటకి వచ్చేశాడు. అప్పుడు గుర్తొచ్చింది సురేష్‌కి.. సృజన కూడా చాలా సార్లు తనని బొత్తిగా తల లేని వాడు అని తిట్టేది. సృజనని అడిగితే ఏమైన ఉపాయం చెప్పవచ్చు. దానితో తన తలను తాను వెనుకకి తెచ్చుకోవొ చ్చు, అని ఇంటి వైపు కారు నడిపాడు.
“సుజీ” అంటూ ఇంట్లోకి వెళ్లాడు, గుండె జలదరిం చింది. సృజన తలలేని శరీరం నైటీ ధరించి ల్యాప్టాప్ చూస్తు ఉంది. ఈక్షణాన్ని చూశాడు. ఆమెకి తల ఉంది, తాను నవ్వు తూ ఉంది. ఏదో పుస్తకం చదువుతూ నవ్వుకుంటుంది. మనసు కొంచం కుదుట పడింది. మనసు కుదుటపడి నప్పుడే, తనకి మనసున్న విషయం తెలుస్తుంది. మాములుగా సురేష్‌కి మనసుతో కాని, ఆ మనుసుకు సురేష్‌తో కానీ పెద్దగా పని ఉండదు.
ఉదయాన్నే లేచి ల్యాప్‌టాప్‌లో లాగిన్ అయితే చాలు. ఈ ప్రపంచం అక్కర్లేదు. ఆకలి వేస్తే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటాడు. ఎలా సుఖపడాలో, ఎలా సంతోషపడాలో ఆన్‌లైన్‌లోనే చుస్తాడు. కాని సుఖలు, సంతోషాలు అను భవించిన జ్ఞాపకాలు లేవు. సురేష్ కనపడని తలలో వేల వేల ఆలోచనలు వస్తున్నాయి.
“సృజనా ! నా తల నీకు కనిపిస్తుందా ?” అని తల లేని సృజన శరీరాన్ని అడిగాడు. సృజన నవ్వినట్లు తెలుస్తుంది. నువ్వు కనపడలేదు, అసలు సృజన తలే కనపడటం లేదు కదా ! “నీ తల కనపడక పోతే ఎం కాదు కానీ, నీ అకౌంట్లో నుంచి డబ్బులు లోన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చెయ్. తలల గురించి తలలేని ఆలోచన కంటే అది ముఖ్యం” అని హెచ్చ రించింది” సృజన.
అవును నిజమే, బ్యాంకు లోన్ కిస్తీ కట్ట కుంటే ఇంటికి మనుషులు వస్తారు. రికవరీ కోసం మను షులు వస్తే తల కొట్టేసినట్లుగా ఉంటుంది. అసలు తలే లేకుంటే, తల కొట్టేసినట్లు ఎట్లా ఉంటుంది. అదే విషయం సృజనను అడగాలనుకున్నాడు. తలే కనపడని సృజనతో మాట్లాడాలనిపించలేదు. ఉత్త నైటీతో ఏం మాట్లాడతాం. సృజన కూర్చోని ఉన్నా టేబుల్ దగ్గరకు దగ్గరికెళ్లాడు.
సృజన శరీరం ల్యాప్టాప్‌లోకి తొంగి చూస్తున్నట్లుంది. ఆమె తల ల్యాప్టాప్ లోకి వెళ్లిపోయిందా ? ఆ ల్యాప్టాప్ వైపు నిశ్శ బ్దంగా చూడసాగాడు, సృజన శరీరానికి కోపం వచ్చింది. నా ల్యాప్టాప్ లోపలికే ఎందుకు తొంగి చూస్తున్నావ్? దీనిలోకి దీనిలోకి చూస్తే నా జీవితంలోకి తొంగి చూసినట్లే, నా ప్రైవసీ హక్కులు హరించినటే’ అని ఉరిమినట్లు చెప్పింది.
సృజన, ల్యాప్టాప్ చూస్తే జీవితంలోకి తొంగి చూసినట్లే ! అంటే ఆ ల్యాప్టాప్ తన జీవితమా? అవునేమో! తల లేకున్నా సృజన కోపం చూపులు గట్టిగా తగిలాయి. అసలు తల లేని సురేష్, తల లేని సృజన ల్యాప్టాప్ లోకి ఎందుకు చూడాలి.
మళ్లీ కనపడని తల ప్రస్తావన సృజన దగ్గర తెచ్చేసరికి, ఆమెకి కోపం తలకెక్కినట్లయింది. కనిపించని తలని చెత్తో కొట్టుకుంటూ “ఈ తలల గొడవేంటి. వెహికిల్ లోన్, ఇంటి లోన్ తీర్చాలి. ఆఫీసు దగ్గర త్రీ బీహెచ్‌కేకి అడ్వాన్స్ ఇవ్వాలి. ఈ సంవత్సరం పెద్ద క్లబ్ సభ్యత్వం తీసుకోవాలి. అందుకు కనీసం కోటి రూపాయలు కావాలి. ఇందులో కనీసం ఏమి చేయకున్నా తలవంచుకోవాల్సి వస్తుంది..
అని విసుక్కుంటూ చెప్పింది సృజన. అసలు లేని తల ఎలా దించుకుంటుందని భార్యని అడగాలనుకున్నాడు, కాని అడగలేదు. తన భార్య తల తనకు కనపడటం లేదు. కనీసం మొహం ఎలా ఉం టుందో కూడా గుర్తు లేదు. కానీ ఆమె చెప్పిన లిస్ట్ మాత్రమే గుర్తుంది. తాను చేసే ప్రాజెక్ట్ పుర్తయితే ఇన్సెంటివ్ వస్తుంది. కొత్తగా కొంత మందిని రిక్రూట్ చేసుకోవాలి.
ఇంటర్వ్యూ తేదీని ఫిక్స్ చేసి చేసి అందరికి ఈమెయిల్స్ పంపించాడు. ఇంతలో బాస్ నుంచి ఫోన్ ఫోన్ వచ్చింది. ప్రాజెక్ట్ పూర్తి కాలేదని త్వరగా పూర్తి చేయమని చెప్పి, రేపు ఆఫీసులో కలవమన్నాడు. బాస్‌ని చూసి చాలా రోజులు అయింది. చాలా ముఖ్యమైన విషయాలు చెప్పడం మార్చిపో యాడు. ఇప్పుడు ఎం మొహం పెట్టుకొని వెళ్లగలడు. అసలు తలే లేనప్పుడు మొహం ఎలా ఉంటుంది. సురేష్‌కి భయం వేసింది. తన తల తనకు వస్తుందా ? రాదా ?
తల ఉన్నా లేకున్నా ఈరోజు ఆఫీసుకెళ్లి ఇంటర్వ్యూ చేయాలి అని కారులో బయలుదేరాడు. దారి పొడుగునా కారులే. చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. తలలు లేని శరీరా లతో కార్లలో వెళుతున్నారు. అందరూ వాళ్ల కార్లని వాల్లే నడుపుతున్నారు. కొన్ని క్యాబ్లలో కూడా తలలు లేని శరీరాలు వెళుతున్నాయి. ట్రాఫిక్‌ని దాటి ఆఫీసుకి చేరుకు న్నాడు. చాలామంది పని చేసే ఆఫీసు అది. సురేష్‌కి ఎవరి తలలూ కనిపించడం లేదు. సురేష్‌కి ఇప్పుడు అర్థమవు తుంది.
వాళ్ల తలలు ముఖాలు తన ఎప్పుడు చూడలేదు. కొన్ని ఆకారాలు బాగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది. నేరుగా బాస్ క్యాబిన్‌కి వెళ్లడు. తల కనబడని బాస్ మోహానికి నవ్వు అంటించి మాట్లాడాడు. మధ్యాహ్నం లోపు పది మందిని ఎంపిక చేయాలి. తల కనిపించని బాస్ ఆర్డర్ చేశాడు. ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. ఫ్రెషర్స్ మాత్రమే ఈ ఉద్యోగానికి అరులు. ఒకరు తర్వాత ఒకరు వాళ్ల స్వంత తలలతోనే వస్తున్నారు. సిస్టమ్ లో వాళ్ల వివరాలని చూస్తూ ప్రశ్నలడుగుతున్నాడు. కొందరు చెపుతున్నారు. కొందరు తెల్ల ముఖం వేస్తున్నారు.
వాళ్లకి తలలు ఉన్నాయ్ కాబట్టి ముఖాలు కూడా ఉన్నాయ్. తెల్లగానైనా పెట్టుకోవచ్చు. నల్లగానైనా పెట్టుకోవచ్చు. ఎవరి ముఖం వాళ్ల ఇష్టం. సురేష్‌కి మాత్రం ఆ అవకాశం లేదు, ఎందుకంటే అతని తల లేదు. పదిమందిని సెలెక్ట్ చేసి హెఆర్‌ని తన రూంలోకి పిలిచి.. తన ముందే వాళ్ల దగ్గర కాంట్రాక్ట్‌పై సంతకాలు చేయించమన్నాడు. ఎంపికైన వాళ్లందరిని లోపలికి పిలిపించాడు. వాళ్ల మొహంలో ఆనందతాండవిస్తుంది. కళ్లలో సంతోషం ఉట్టి పడుతోంది. ఒక్కొక్కరికీ ప్యాకేజీ వివరాలు చెప్పి కాంట్రాక్ట్ సంతకాలు చేయించమని చెప్పి, సెలెక్ట్ అయిన వారి వివరాలు చూస్తు, సిస్టమ్ ముందు కూర్చోన్నాడు సురేష్.
ముందుగా సంతకం చేస్తున్న మనిషిని చూస్తూ, అతని వివరాలు చదువుతున్నాడు.. అంతే ! సజీవంగా ఉన్న తల సిస్టమ్ లో కనిపించింది. ఉలిక్కి పడి అతని వైపు చూశాడు, ఇప్పుడు అతనికి తల లేదు. చూస్తుండగానే పధి తలలు సిస్టమ్‌లో కనిపించాయి. “అందరి సంతకాలు అయిపోయా య్” అని హెఆర్ మేనేజర్ మాటలు వినిపిస్తున్నా సమా ధానం చెప్పలేదు. తల లేని సురేష్ మెదడు పనిచేయటం ప్రారంభించింది.
సిస్టమ్ లో ఉద్యోగస్తుల అందరి ఫైల్ తెరిచాడు, వందల తలలు... పదిహేను పదహారు వందల తలలు, అందులో సురేష్‌కి బాగా పరిచయం ఉన్న ఒక మొహం కనిపించింది. అది మృదులది. తను అతడి కాలేజీ ఫ్రెండ్. తాను ఉంటున్న ఫ్లోర్లోనే పని చేస్తుంది. పని ఒత్తిడి వల్లనో, తనకి మృదులకి ఒకరి తలలు ఒకరికి కనపడక పోవడం వల్లనో ఇన్ని రోజులు గుర్తుపట్టలేదు.
మృదుల కూర్చున్న స్థలం వైపు పరిగెత్తాడు. ఆమె చాలా దగ్గరి స్నేహితురాలు. చూడగానే అభిమానం ఉప్పొంగింది. సంతోషంగా, ఆనందంగా, ప్రేమగా మృదుల వైపు చూశాడు సురేష్. ఇప్పటి వరకు కనపడని మృదుల తల కనిపించింది. సురేష్ ముఖం చాటంతయినట్లు అనుభూతి కలిగింది. అద్దంలో చూసుకున్నాడు. చాటంత మొహం కనిపించింది. తల కూడా కని పించింది.
మృదులని ఆర్తిగా పిలిచాడు. “నేను మీకు ఏలా సహాయం చేయగలను”? అంది. అంటే సురేష్ ముఖం ఇంకా మృదులకి కనిపించటం లేదన్న మాట. దగ్గరగా పోయి తను ఎవరో మృదులకి తెలుగులో చెప్పాడు. మృదుల ముఖంలో సంతోషం విప్పారింది. “సురేష్ ! నీ ముఖం నాకు కనిపిస్తుంది రా” అని అరిచినట్టు అంది మృదుల.
“మృదులా ! మన ఆఫీసులో నీకు ఎవరి తలలైనా కనిపిస్తున్నాయా” క్యూరియాసిటీ చంపుకోలేక అడిగాడు సురేష్. “నీ ముఖం తప్ప నాకు ఎవ్వరి ముఖాలు కనపడటం లేదు, ఎవ్వరికీ తలలు లేవు”.
“అవి ఎక్కడున్నయో నాకు తెలుసు. ఇప్పటికి కూడా మన తలలు వీరికి కనిపించకుండానే ఉండవచ్చు. మనం తలలు ఉన్న మనుషుల దగ్గరికి వెళ్లాం పదా.. అని మృదుల చేతిని పట్టుకుని ఆఫీసు బయటకి తీసుకువెళ్లాడు. ఇద్దరు కారులో కూర్చొని లాంగ్ డ్రైవ్‌కి బయల్దేరారు. దారి పొడువునా తలలులేని శరీరాలే.. కారులోనో, బస్సులోనో, నడుస్తునో కనిపిస్తున్నాయి. సురేష్, మృదుల చాలా దూరంగా వెళ్తున్నారు.
నగరాలనీ దాటి, పట్టణాలనీ దాటి, చిన్న చిన్న పల్లెలుండే ప్రదేశానికి చేరుకున్నారు. అడవి లాంటి ప్రదేశానికి చేరి ఆగారు. ఆ అడవిలో మనుషులు న్నారు, వాళ్లకి తలలు ఉన్నాయి. అందమైన, అమాయక మైన ముఖాలు, సహజమైన నవ్వులు కనిపిస్తున్నాయి. సురేష్, మృదుల చాలా కాలం తర్వాత సహజ లోకం లోకి వచ్చారు. వాళ్ల కళ్లు, చెవులు, ముక్కు, మెదడు, తలలోని అన్నీ భాగాలు పనిచేస్తున్నాయి.
పచ్చని చెట్లు కని పిస్తున్నాయి, పక్షులు కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. మట్టి వాసన మత్తెకిస్తుంది. కోపమో, దుఃఖమో, సంతో షమో, అసూయ, ద్వేషమో, ఏదో ఒక మానవ స్వభావం బయట పడితే మనుషులవుతారు. ఏమైన తప్పులుంటే దిద్దుకుంటారు. సురేష్‌కు తన తాతయ్య గుర్తొచ్చాడు. తల తాకట్టు పెట్టాయినా నిన్ను ఇంజినీరింగ్ చదివిస్తాననే వాడు. తాకట్టు పెడితే విడిపించుకోవచ్చు.
పెద్ద పెద్ద కంపెనీల్లో తలలు అమ్మేసుకుంటున్నారు. విల్లాలు కొనాలనో, కార్లు కొనాలనో, పెద్ద స్కూల్లో పిల్లల ఫీజులు కట్టాలనో తలలని, మనసుల్ని అమ్మేసుకుంటున్నారు. కాలేజీ కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు అక్కడే ఉండిపోయారు సురేష్, మృదుల. వారికి కుటుంబం సభ్యులు గుర్తొచ్చారు. వాళ్ల తలలు కూడా వెన్నక్కి తెచ్చుకోవాలి. తిరిగి తలలు లేని వెధవలుండేవైపు బయల్దేరారు. తర్వాత ఇంటర్వ్యూ హాలు ముందు తాను పెట్టిన బోర్డు గుర్తొచ్చింది సురేష్‌కి. ‘వీ ఆర్ హైరింగ్... ఇక్కడ తలలు కొనబడును’ అని.