07-05-2025 12:08:59 AM
సందడి చేసిన సినీ నటి నేహాశెట్టి
ఆర్మూర్, మే 6 : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని మామిడిపల్లి చౌరస్తా వద్ద మంగళవారం ఎల్విఆర్ షాపింగ్ మాల్ ను సీజీ నటి నేహా శెట్టి ప్రారంభించారు. మొదటి జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ ప్రారంభించిన నేహా శెట్టి.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి భారీగా హాజరైన ప్రజలకు అభివాదం చేశారు. అందరూ ఎలా ఉన్నారు? అని తెలుగులో మాట్లాడారు. ఎల్విఆర్ షాపింగ్ మాల్ లో ప్రజలకు అందుబాటు ధరల్లో వస్త్రాలు లభిస్తాయి అని చెప్పారు.
ఎల్ వి ఆర్ షాపింగ్ మాల్ యజమానులు సరసమైన ధరలకు మంచి నాణ్యమైన వస్త్రాలను అందిస్తారని తెలిపారు. ఎల్వి ఆర్ షాపింగ్ మాల్ ను ఆర్మూర్ ప్రజలందరూ ఆదరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి, అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతి నిధులు, నాయకులు, ఎల్ వి ఆర్ షాపింగ్ మాల్ ప్రోప్రైటర్లు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.