07-05-2025 12:09:09 AM
త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన బ్యాంక్ ఆఫ్ బరోడా
ముంబై, మే 6: దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మంగళవారం జనవరి సంబంధించి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. క్యూ4లో బీవోబీ నికర లాభం 3.3 శాతం పెరిగి రూ. 5,048 కోట్లకు చేరింది. గతేడాది రూ. 4,886 కోట్లుగా ఉంది. వడ్డీ ఆదాయం 3.6 శాతం పెరిగి రూ. 30, 642 కోట్లకు చేరింది.
గతేడాది ఇది రూ. 29. 583 కోట్లుగా ఉంది. ఇక వడ్డీ ఖర్చులు 10 శాతం పెరిగి రూ. 19, 622.39 కోట్లకు చేరాయి. అయితే నికర వడ్డీ ఆదాయం మాత్రం 6.6 శాతం తగ్గి రూ. 11,020 కోట్లకు పడిపోయింది. గతేడాది ఇది రూ. 11, 793 కోట్లుగా ఉంది. దీంతో బీవోబీ షేర్లు మంగళవారం అనూహ్యంగా 11 శాతం పతనమవ్వగా.. మార్కెట్ ముగిసే సమయానికి రూ. 222 వద్ద స్థిరపడ్డాయి. కాగా 2024 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 8.35 డివిడెండ్‌ను ప్రకటించిన బ్యాంక్ ఆఫ్ బరోడా జూన్ 6ను రికార్డు తేదీగా ఖరారు చేసింది.