calender_icon.png 26 December, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనుధర్మం వద్దు.. భారత రాజ్యాంగం ముద్దు

26-12-2025 12:00:00 AM

కేవీపీస్ జిల్లా ఉపాధ్యక్షడు మల్లేష్

ఆదిలాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి) : మానవత్వం లేకుండా మనుషుల ను నాలుగు వర్ణాలుగా, తదనంతరం కులాలుగా విభజించి సమాజాన్ని ముందుకు పోనివ్వకుండా మనుధర్మ శాస్త్రం అడ్డుపడిందని కేవీపీస్ జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్ ఆరోపించారు. గురువారం కేవీపీస్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రం ప్రతులను స్థానిక బాశెట్టి మాధవరావు స్మారక కేంద్రం ఎదుట ధగ్ధం చేసి, నిరసన తెలిపారు. ఈ సందర్బంగా మల్లేష్ మాట్లాడుతూ  1927 డిసెంబర్ 25న డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ మనుధర్మాన్ని దహనం చేశారన్నారు.

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి కుల వివక్షను నిషేదించిన ఆచారణలో మనుధర్మ శాస్త్రమే  అమలు జరుగుతున్నదన్నారు. మనుషులు మానసికంగా భారత రాజ్యాంగం కన్న   మనుధర్మ న్నే నమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు సైతం కులం, మతం పేరుతో ప్రజలను విడదీసే ప్రయ త్నం చేస్తున్నారన్నారు. నేటికీ సమాజంలో కులాన్నీ చూసి గౌరవించే సంప్రదాయం ఉండటం బాధాకరం అని పేర్కొన్నారు.

మహిళలకు హక్కులను నిరాకరించిన మనుధర్మమే నేటికీపై చేయిగా చెలామణి అవు తున్నదన్నారు. పురుషాధిక్యత సమాజంలో మహిళలు రెండో తరగతి పౌరులుగా బ్రతుకుతున్నారని, దీనికి కారణం మనుధర్మ శాస్త్రమే అన్నారు. కేవీపీస్ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుందన్నారు. మనుధర్మాన్ని మానవత వాదులం దరు వ్యతి రేకించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కేవీపీస్ జిల్లా అధ్యక్షులు  పవర్ జితేందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు లంక రాఘవులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షలు బండి దత్తాత్రి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు  బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్ సహాయ కార్యదర్శి సురేందర్, వ్యాసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి స్వామి తదితరులు పాల్గొన్నారు.