calender_icon.png 26 December, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకంతాబాల్యమే పుస్తకావిష్కరణ

26-12-2025 12:00:00 AM

నిర్మల్ డిసెంబర్ 25 (విజయక్రాంతి) : విశ్రాంత ఎంపీడీవో (నిర్మల్) చట్ల గజ్జారాం రచించిన ‘బ్రతుకంతా బాల్యమే‘ అనే వచన కావ్యాన్ని ఈరోజు స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో  ప్రముఖ కవి రచయిత డా. అప్పాల చక్రధారి అధ్యక్షతన డాక్టర్ గోపు కిషన్  ఆవిష్కరించినారు. ముఖ్యఅతిథిగా డా. దామెర రాములు, విశిష్ట అతిథులుగా డా.కృష్ణంరాజు, డా.మురళీధర్, పత్తి శివప్రసాద్, ముని మడుగుల రాజారావు, మరియు కవులు కళాకారులు, బంధుమిత్రులు, లయ న్స్ క్లబ్ సభ్యులు పాల్గొని ప్రసంగించారు. ప్రముఖ కవి బొందిడి పురుషోత్తమరావు సవివరంగా పుస్తక సమీక్ష నిర్వహించారు.

తెరవే అధ్యక్షులు డా.నేరెళ్ల హనుమంతు సభా సమన్వయకర్తగా సభను విజయవంతంగా నడిపిం చారు. ఈ పుస్తకం మనిషి జీవితంలోని ప్రతి కోణాన్ని స్పృశిస్తుందని, ఆదర్శవంతమైన జీవనం గడపడానికి దోహదపడు తుందని, సరళమైన సంస్కారవంతమైన భాషలో కవి చట్ల గజ్జారాం కవిత్వీకరించడం ప్రశంసనీయమని, ఇది ప్రచురిత మైన అతని మూడవ కావ్యమని, ఇదివరకు ‘కౌమారామృత శతకం‘ కిశోర గాంధీయం‘ అనే ప్రజా ఉపయోగకరమైన కావ్యాల్ని అందించినారని, ఇంకా ఎన్నో రచనలు వారి నుండి రావాలని డా. అప్పాల చక్రధారితోపాటు అనేకమంది కవులు కళాకారులు, వక్తలు కొనియాడారు.